చంద్రబాబు బయోపిక్ లో బాబు గారి లుక్ ఇదే ….!

cbn , chandrababu biopic , chandrodayam first look , trendingandhra
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓ దూరదృష్టి ఉన్న నేత . తనదైన రాజకీయం తో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి మొదలకొని, నేటి అమరావతి వరకు ఆంధ్రప్రదేశ్ అభివృద్ది కే అనుక్షణం అంకురీత దీక్ష తో పనిచేస్తున్నారు. ప్రజా నాయకుడిగా ఆయన తన మార్క్ పరిపాలనతొ ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలను సంపాదించారు. దానికి నిదర్శనమే ఐక్యరాజ్యసమితి నుంచి ఆహ్వానం అని చెప్పవచ్చు .

ఈ శుభ సమయం లో బాబు బయోపిక్ ‘చంద్రోదయం’ లోని ఆయన పాత్ర లుక్ ను విడుదల చెస్తున్నారు. ‘చంద్రోదయం’ ను పి.వెంకటరమణ దర్శకత్వం లొ జి.జె.వి.కె.రాజేంద్ర నిర్మిస్తున్నారు. మోహన శ్రీజ సినిమాస్, శ్వేతార్క గణపతి ఎంటర్‌ప్రైజెస్ బ్యానర్స్ పై సంయుక్తంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది.

Chandrodayam First Look , trendingandhra

నిర్మాత రాజేంద్ర మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి గా చంద్రబాబు నాయుడు గారి పాత్రలొ నటిస్తొన్న వినొద్ లుక్ ను విడుదల చెస్తున్నాము. ‘చంద్రోదయం ‘ చిత్రీకరణ పూర్తయింది. నారా వారి పల్లె, తిరుపతి, హైదరాబాద్ ,అమరావతి, సింగపూర్ లాంటి లొకెషన్స్ లొ షూటింగ్ చేశాము. నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి.
ఎప్పటికైనా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి లొ అణువణువునా ఆయన మార్క్ మనకు కన్పిస్తూనే ఉంటుంది. అలాంటి మహా నాయకుడి బయోపిక్ ను మేము ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాము. అక్టోబరులో పాటలను, వెనువెంటనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామన్నారు.