ఆ మంత్రికి అసమ్మతి సెగ …

chandulal,trendingandhra

ప్రచారంలో పోలీసుల నిఘా తెలంగాణా రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు దగ్గర పడుతుంటే బరిలో ఉన్న అభ్యర్థుల్లో టెన్షన్ పీక్స్ లోకి చేరుతుంది. వీళ్ళు వాళ్ళు అన్న తేడా లేకుండా ఎమ్మెల్యేలకు, మంత్రులకు సైతం అసమ్మతి సెగ తగులుతుంది. కొన్ని చోట్ల ఏకంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంటుంది. శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసులు నానా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. టీఆర్ ఎస్ పార్టీ నుండి ములుగు నియోజకవర్గ అభ్యర్థిగా టికెట్ పొందిన తెలంగాణ మంత్రి అజ్మీరా చందులాల్ కి అసమ్మతి సెగ తగిలింది. తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు ప్రకటించిన నేపథ్యంలో తమ పార్టీ అభ్యర్థుల జాబితాను కేసీఆర్ ప్రకటించారు. టికెట్ దక్కిన అభ్యర్థులు ప్రచారాలు చేపడుతుండగా.. దక్కని వారు మాత్రం కోపంతో రగిలిపోతున్నారు. ప్రచారానికి వచ్చిన వారిపై నిరసనలకు దిగుతున్నారు.

Chandulal,trendingandhra

తాజాగా గిరిజన శాఖా మంత్రి చందులాల్ కి కూడా ఈ అనుభవం ఎదురైంది. అసమ్మతి నేతలు చందూలాల్ అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా నిరసిస్తున్నారు. తన తండ్రి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారన్న కోపంతో చందులాల్‌ కుమారుడు ప్రహ్లాద్‌ తన అనుచరులతో కలిసి అసమ్మతి నేతల వాహనాలను ధ్వంసం చేశారు. దీంతో ములుగులో ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో తిరుగుబాటు నేతలు చందులాల్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. మంత్రి కుమారుడి తీరుకు వ్యతిరేకంగా ప్రచారానికి వచ్చిన చందులాల్‌కు తిరుగుబాటు నేతలు అడ్డుకున్నారు. దీంతో ములుగులో టీఆర్‌ఎస్‌ పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది. అసమ్మతి వర్గం, చందులాల్‌ వర్గాల మధ్య వివాదం రోజురోజుకు మరింత ముదురుతున్న నేపధ్యంలో ములుగులో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో పోలీసులు ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా నిఘా కట్టుదిట్టం చేశారు. పోలీసుల భద్రత నడుమ చందులాల్‌ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.

#ChandulalElectionCampaignwiththeHelpofPoliceProtection #TRS #Chandulal