నేను వ్యక్తిగతంగా మాట్లాడితే మూడ్రోజులు అన్నం తినలేవ్ …పవన్ కి కౌంటర్ ఇచ్చిన చింతమనేని

chintamaneni prabhakar , trendingandhra

నేను వ్యక్తిగతంగా మాట్లాడితే మూడ్రోజుల పాటు అన్నం తినలేవ్. .” అని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి దెందలూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వ్యాఖ్యానించారు. పవన్ తనపట్ల చేసిన ఆరోపణలపై చింతమనేని గురువారం విజయవాడలో మీడియా సమావేశం నిర్వహించారు.

TDP-MLA-Chintamaneni-Prabhakar , trendingandhra

ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన..” పవన్ నన్ను ‘ఆకు రౌడీ’, ‘వీధి రౌడీ’ అంటున్నారు. ఈ పేర్లు రిజిస్టర్ చేయించుకుని భవిష్యత్తులో సినిమాలకు ఈ టైటిల్స్ పెట్టుకుంటే బ్రహ్మాండంగా ఉంటుందేమో ఒక్కసారి ఆలోచించండి. నటుడిగా పవన్‌ను అభిమానిస్తాను.. నీ ఫ్యాన్స్ ఎవరూ బాధపడకూడదనే ఉద్దేశంతో నేను మీ వ్యక్తిగత విషయాల జోలికి పోదల్చుకోలేదు. నా వ్యక్తిగత విషయాలతో ఈ రాష్ట్రానికి నన్ను పరిచయం చేయాలని పవన్ చాలా తాపత్రయం పడుతున్నారు. రాజకీయాల్లో యాక్ట్ చేయడమంటే.. గబ్బర్ సింగ్‌లాగా సినిమాల్లో యాక్ట్ చేయడం కాదు. నేను వ్యక్తిగతంగా మాట్లాడితే మూడ్రోజుల పాటు మీరు అన్నం తినలేరు.

కనీసం విప్‌కు.. చీఫ్ విప్‌కు మీకు తేడా తెలియదు. నాకు చంద్రబాబు ఇచ్చింది విప్.. మీరేమో చీఫ్ విప్ అని చెబుతున్నారు. ఆ మాత్రం అవగాహన ఉండదా?. రాజకీయ పార్టీని నడుపుతున్నామంటే ఊరికే యాగా బోగీగానా?.. దారిన పోయే దానయ్య లాగా నువ్వు మాట్లాడటానికి సరిపోవ్. నువ్వు రాష్ట్ర పార్టీకి అధ్యక్షుడివి. దేశంలో ప్రధాన సమస్యలు చాలానా ఉన్నాయ్. ముఖ్యంగా హోదా గురించి ఎందుకు మాట్లాడలేకపోతున్నావ్.. ఢిల్లీలో నీకు కూడా పాచిపోయిన లడ్డూ ఏమైనా అందిందా? ” అని పవన్‌పై చింతమనేని వరుస ప్రశ్నలు సంధించారు.