బాలయ్య బాబు కు ముక్కుమీద కోపం అంటున్న నటుడు

సమీర్ బుల్లితెర నటుడుగా కెరీర్ ఆరంభించి ఆ క్రేజ్ తో వెండితెరకి వెళ్లాడు. అక్కడ ఆయన విభిన్నమైన క్యారెక్టర్స్ చేస్తూ మంచి గుర్తింపు పొందాడు. తాజా ఒక ఇంటర్వ్యూలో ఆయనని ఒక ప్రశ్న అడిగారు. మీరు బాలకృష్ణతో నటిస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించింది?’ అప్పుడు ఆయన ఇలా సమాధానం ఇచ్చారు.

నేను ఇప్పటివరకు బాలకృష్ణగారితో రెండు సినిమాలు చేశాను. ఫస్టు టైమ్ ఆయనతో చేస్తున్నప్పుడు చుట్టుపక్కల వాళ్లు ఆయనతో కాస్త జాగ్రత్తగా ఉండండి ఆయనకి కొంచెం కోపం ఎక్కువ అని భయపెట్టారు.

కానీ ఆయనతో మాట్లాడిన తరువాత బాలకృష్ణ గారు ఎంత సరదా మనిషి అనేది నాకు అర్థమైవుంది. సెట్లో ఒక మూలన సైలెంట్ గా కూర్చునే వాళ్లంటే ఆయనకి ఇష్టం ఉండదు.

ఆయన సరదాగా వుంటారు .. మిగతా వాళ్లు అలా ఉండాలనే కోరుకుంటారు. ఇక వర్క్ విషయానికొస్తే ఆయన ఎంత సిన్సియర్ అండ్ డెడికేటెడ్ పర్సన్ ని నేను ఇంతవరకు చూడలేదు అని అన్నాడు. మిగతా వాళ్లూ కూడా బాలకృష్ణ గారి లాగా ఉండాలనే ఆశిస్తున్నాను అని చెప్పుకొచ్చాడు.