రాహుల్ పై కోపంగా ఉన్న అడవి శేష్.

టాలీవుడ్ లో ఆగస్టు 3న రిలీజ్ ఆయన రెండు సినిమాలు మంచి కలెక్షన్స్ రాబడుతున్నాయి. అవే సుశాంత్ హీరోగా చేసిన చిలసౌ మరియు అడవి శేష్ హీరోగా చేసిన గూఢచారి. చిలసౌ చిత్రానికి దర్శకత్యం వహించిన రాహుల్ మరియు అడవి శేష్ ఇద్దరు కూడా మంచి ఫ్రెండ్స్ కూడా. అయితే వీరిద్దరూ తమ సినిమాలను రిలీజ్ చేసే విషయం లో పోటీ పడకుండా కొంత గ్యాప్ తో రిలీజ్ చెయ్యాలని అనుకున్నారంట. కానీ రాహుల్ అదే రోజున తను దర్శకత్యం వహించిన చిలసౌ రిలీజ్ చేసాడని దీని వలన మాఇద్దరి మధ్య పోటీ నెలకుందని అడవి శేష్ ఆగ్రహం వ్యక్తం చేసాడంట.

సుశాంత్ హీరోగా నటించిన చిలసౌ చిత్రానికి రాహుల్ దర్శకత్వం వహించగా నాగార్జున , నాగచైతన్య , సమంత సపోర్ట్ చేసి అన్నపూర్ణ బ్యానర్ పై విడుదల చేసారు . ఈ చిత్రం హిట్ టాక్ తెచ్చుకోవడమే కాకుండా మంచి కలెక్షన్స్ కూడా రాబడుతుంది .

అయితే అంతకుమించి వసూళ్ల ని రాబడుతూ శరవేగంగా దూసుకుపోతోంది గూఢచారి చిత్రం . ఇది కూడా ఆగస్టు 3నే విడుదలయ్యింది . అయితే రా నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం కావడంతో ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరధం పడుతున్నారు. దాంతో నాలుగు రోజుల్లోనే పది కోట్ల వసూళ్ల ని సాధించిందని సమాచారం

సోలో గా వచ్చి ఉంటే మరిన్ని వసూళ్లు సాధించేవాడినని ఫీల్ అవుతున్నాడంట అడవి శేష్. అందుకే రాహుల్ అంటే కోపం అంట . చిలసౌ కూడా మంచి వసూళ్ల నే సాధిస్తోంది . ఇప్పటివరకు కోటిన్నర షేర్ రాబట్టింది ఆ చిత్రం . ఇంకా కోటి పైనే రాబట్టే ఛాన్స్ ఉంది దానికి తోడు శాటిలైట్ , డిజిటల్ రైట్స్ , డబ్బింగ్ , రీమేక్ రైట్స్ రూపంలో మరిన్ని వసూళ్లు రాబడుతుంది తక్కువబడ్జెట్ లో రూపొందిన చిత్రం కాబట్టి చిలసౌ కూడా హిట్ సినిమానే అన్నమాట