అరవింద సమేత’ ప్రీ రిలీజ్‌ బిజినెస్‌……చూస్తే దిమ్మతిరిగిపోతుంది ….!

aravinda sametha , trendingandhra

ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో భారీ అంచనాల నడుమ రూపొందిన ‘అరవింద సమేత’ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రం అంతకు మించిన భారీ ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ను చేసింది. కేవలం థియేట్రికల్‌ రైట్స్‌ ద్వారా ఈ చిత్రం ఏకంగా 92 కోట్లను నిర్మాత ఖాతాలో వేసినట్లుగా సమాచారం అందుతుంది. త్రివిక్రమ్‌ మరియు ఎన్టీఆర్‌ కాంబోకు ఉన్న క్రేజ్‌ నేపథ్యంలో ఇంత భారీగా వసూళ్లు సాధించినట్లుగా సమాచారం అందుతుంది.NTR, Aravinda Sametha,Trendingandhra

అన్ని ఏరియాల్లో కూడా ఈ చిత్రం ఎన్టీఆర్‌ గత చిత్రాలను బీట్‌ చేసి బిజినెస్‌ చేసింది. 92 కోట్ల ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ అయిన నేపథ్యంలో 100 కోట్ల షేర్‌ను ఈ చిత్రం రాబట్టాల్సి ఉంది. అలా రాబట్టితేనే డిస్ట్రిబ్యూటర్లు సేఫ్‌ అవుతారు. మరి డిస్ట్రిబ్యూటర్ల పరిస్థితి ఏంటీ అనేది మరో మూడు రోజుల్లో తేలిపోనుంది. దసరా కానుకగా ఈ చిత్రం అక్టోబర్‌ 11న విడుదల కాబోతున్న విషయం తెల్సిందే.

‘అరవింద సమేత’ ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ :
నైజాం : 19 కోట్లు
సీడెడ్‌ : 15 కోట్లు
వైజాగ్‌ : 9.2 కోట్లు
ఈస్ట్‌ : 6 కోట్లు
వెస్ట్‌ : 4.8 కోట్లు
గుంటూరు : 7.2 కోట్లు
కృష్ణ : 5.5 కోట్లు
నెల్లూరు :3.3 కోట్లు
కర్ణాటక : 8.2 కోట్లు
ఓవర్సీస్‌ : 12.5 కోట్లు
ఇతరం : 1.3 కోట్లు
మొత్తం : 92 కోట్లు