రికార్డుల ఊచకోత….యూట్యూబ్ ని షేక్ చేస్తున్న అరవిందసమేత….!

Aravinda Sametha , trendingandhra

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ అరవింద సమేత ప్రీ రిలీజ్ ఈవెంట్ మంగళవారం సాయంత్రం జరిగింది. ఈ వేడుకలో భాగంగా సినిమా ట్రైలర్ ను నందమూరి కళ్యాణ్ రాం లీజ్ చేయడం జరిగింది. త్రివిక్రం, ఎన్.టి.ఆర్ కాంబినేషన్ లో ఎలాంటి సినిమా అభిమానులు ఆశిస్తారో ఆ అంచనాలకు మించి ఈ సినిమా ఉంటుందని చెప్పేలా ట్రైలర్ ఉంది.

aravinda sametha ,NTR ,TrendingAndhra

ముందు ముహుర్తం పెట్టునట్టుగానే 8 గంటల టైంలో ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇక ట్రైలర్ వచ్చి సరిగ్గా 12 గంటలు కాకముందే 4 మిలియన్స్ వ్యూస్ దాటి రికార్డుల ఊచకోత కోస్తున్నాడు ఎన్.టి.ఆర్. ట్రైలర్ వచ్చిన కొద్దిసేపటికే మిలియన్ వ్యూస్ సాధించిన అరవింద సమేత ట్రైలర్ ప్రస్తుతం 4 మిలియన్ వ్యూస్ తో రికార్డ్ వ్యూయర్ కౌంట్ సాధించింది.
ఇక మరో పక్క ఈ ట్రైలర్ కు లైకులు కూడా అదే రేంజ్ లో వస్తున్నాయి. ఇప్పటివరకు 2,48,000 పైగా లైకిలు వచ్చాయి. చూస్తుంటే ఎన్.టి.ఆర్
అభిమానులకు దసరా పండుగ ఇప్పటి నుండే మొదలైందని అనిపిస్తుంది. ట్రైలర్ తో అదరగొట్టిన తారక్ సినిమా కూడా సంచలనాలు సృష్టిస్తాడని ఫిక్స్ అవ్వొచ్చు.
త్రివిక్రం మాటలు.. ఎన్.టి.ఆర్ నటన వీటితో పాటుగా తమన్ ఇచ్చిన మ్యూజిక్ సినిమాకు హైలెట్ గా నిలుస్తాయని తెలుస్తుంది. పాటలతో పాటుగా తమన్ ఈ సినిమాకు ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాపై అంచనాలను పెంచింది. పూజా హెగ్దె, ఈషా రెబ్బ హీరోయిన్స్ గా నటిస్తున్న అరవింద సమేత వీర రాఘవ సినిమాను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో ఎస్. రాధాకృష్ణ నిర్మించారు.