అరవింద సమేత ప్రీమియర్ షో రివ్యూ..! హిట్టా..?ఫట్టా..? షాకింగ్ రెస్పాన్స్ ..

aravindhasametha , ntr , pijahegde

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజా చిత్రం అరవింద సమేత నేడే అభిమానుల ముందుకు వచ్చింది .త్రివిక్రమ్ దర్శకత్వంలో తొలిసారిగా నటించిన ఈ సినిమా పై భారీ హైప్ ఉంది.రీసెంట్ గా విడుదల అయిన టీజర్,ట్రైలర్ కియా భారీ రెస్పాన్స్ రావడంతో సినిమా పై భారీ హైప్ క్రియేట్ అయ్యింది.ఎన్టీఆర్ కెరీర్లోనే అత్యంత భారీ ఎత్తున విడుదల అయ్యింది.

ఈ సినిమా నేడు ప్రీమియర్ షో తో రిలీజ్ కానుంది.ముందుగా ఓవర్సీస్ లో ప్రసారం అయిన ఈ సినిమాకు అక్కడ నుండి అందిరిపోయే టాక్ వచ్చింది .అరవింద సమేత సినిమా పక్కా మాస్ అభిమానుల కు పూనకాలు తెప్పించే విధంగా త్రివిక్రమ్ తెరకెక్కించాడు.అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ నచ్చే అంశంలను కూడా త్రివిక్రమ్ అద్బుతంగా తెరకెక్కించాడు.

ఇక సినిమాలో హైలెట్స్ విషయానికి వస్తే….సినిమా ఫస్ట్ ఆఫ్ రక్తం మరిగించే సీన్ లతో ఎన్టీఆర్ తన నట విశ్వరూపం చూపించాడు.త్రివిక్రమ్ డైలాగ్స్, ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్, ఇంటర్వెల్ సీన్ కి గూస్ బంప్స్ రావలిసిందే.ఈ సీన్ నే ఫస్ట్ ఆఫ్ కి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్స్ అని అంటున్నారు.ఇక సెకండ్ ఆఫ్ మనుసు కి అంతుకునే సీన్స్ లతో అలాగే ఎన్టీఆర్ సరికొత్తగా చూపించాడు త్రివిక్రమ్.

అటు సునీల్ కూడా కామెడీ,ఎమోషనల్ సీన్స్ లతో అందరాగోట్టాడు.ఇక నాగబాబు,జగపతి బాబు,నవీన్ చంద్ర నటన సినిమాకే హైలెట్.ముఖ్యంగా పూజా గ్లామర్,నటన సినిమాకి మరింతగా ప్లేస్ అయ్యింది.ఇక తమన్ అందిచిన మ్యూజిక్ సినిమాని నెక్స్ట్ లెవల్ కి తీసుకుబోయింది.

ఇక చిన్న చిన్న మైనస్ పాయింట్స్ పక్కకు పెడితే ఎన్టీఆర్ ఈ మధ్య చేసిన కమర్షియల్ సినిమాలో ఈ సినిమా ది బెస్ట్ గా నిలుస్తుందని అలాగే త్రివిక్రమ తీసిన సినిమాల్లో బెటర్ అవుట్ పుట్ ఇచ్చిన సినిమా ఇదే నని అంటున్నారు. ఓవర్సీస్ నుండి సినిమాకు ఇలా పాజిటివ్ టాక్ రావడం తో ఇక రెగ్యులర్ షోల కి కూడా ఇదే రేంజ్ టాక్ వస్తే సినిమా కచ్చితంగా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి వసూళ్లు సాధించే అవకాశం ఉందని అంటున్నారు.

Aravinda sametha , trendingandhra