అరవింద సమేత మూవీ రివ్యూ …!

aravinda sametha movie review, ntr , trendingandhra

నందమూరి యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా , అందాల తార పూజాహెగ్డే హీరోయిన్ గా , టాలీవుడ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్స్ లో తెరకెక్కిన చిత్రం అరవిందసమేత వీరరాఘవ . దసరా కానుకగా నేడే ప్రేక్షకుల ముందుకి వచ్చింది . ఇందులో ఎన్టీఆర్ చాలా రోజుల తరువాత ఫ్యాక్షన్ లీడర్ గా కనిపించనుండడం తో ఈ సినిమా ఫై అంచనాలు తార స్థాయి లో ఉన్నాయి . ఇక పొతే రాయలసీమ లోని కొన్ని సిటీస్ లో ఇప్పటికే మొదటి షో ని కంప్లీట్ చేసుకున్నది . సినిమా చూసిన ప్రతిఒక్కరూ కూడా సినిమా గురించి , ఎన్టీఆర్ నటన గురించి ప్రత్యేకంగా చెప్తున్నారు .

NTR, Aravinda Sametha,Trendingandhra

ఇక పొతే సినిమా గురించి అభిమానులు మాట్లాడుతూ ఎన్టీఆర్ ఒక్కడే ఈ సినిమా మొత్తాన్ని నడిపించాడని , సినిమా ఉండే రెండున్నర గంటల పటు ఎన్టీఆర్ ఒక్కడే తన నటవిశ్వరూపాన్ని చూపించాడని , సినిమా మొత్తం వన్ మ్యాన్ షో అని చెప్పుకొస్తున్నారు . మరి ముఖ్యంగా బ్రేక్ కి ముందు వచ్చే ప్రీ క్లైమాక్స్ ఫైటింగ్ సినిమా పై అంచనాలు తార స్థాయి కి పెంచుతుంది అని చెప్పారు . ఇక ఎమోషనల్ సీన్స్ లో ఎన్టీఆర్ తనదైన రీతిలో పండించాడని , అందరిని కంటతడి పెట్టించాడని చెప్పారు . మెగాబ్రదర్ నాగబాబు ఎన్టీఆర్ తండ్రిగా మరోసారి సూపర్ ఫోర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నాడని , నాగబాబు చనిపోయే సీన్ లో ఐతే నాగబాబు , ఎన్టీఆర్ మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ సినిమాని మరోస్థాయి కి తీసుకువెళ్తుందని చెప్పారు .

aravinda sametha ,Trendingandhra
అలాగే ఈ సినిమా లోని సాంగ్స్ రిలీజ్ కాగానే అందరూ బాగా కనెస్ట్ ఐంది పెనిమిటి సాంగ్ కె . అదే సాంగ్ సినిమాలో వస్తుంటే అందరూ కూడా లేచి నిలబడి చప్పట్లతో థియేటర్స్ దద్దరిల్లేలా చేసారని చెప్పుకొచ్చారు , అంతలా ఆ పాట అందరిని ఆకట్టుకున్నది అని తెలుస్తుంది . ఇక త్రివిక్రమ్ పంచ్ డైలాగ్స్ కూడా సినిమాకి మరో ప్లస్ పాయింట్ అని ,థమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా సినిమాకి పెద్ద అడ్వాంటేజ్ గా మారింది అని తెలిపారు . అలాగే మాస్ ఆడియన్స్ కోసం చివర్లో రెడ్డి సాంగ్ లో ఎన్టీఆర్ తన డాన్స్ తో అందరిని అలరించాడని చెప్పారు . ఎన్టీఆర్ చెప్పే ప్రతి డైలాగ్ కి కూడా థియేటర్స్ మారుమోగిపోతున్నాయి అని తెలుస్తుంది . మొత్తం మీద ఈ సినిమాలో ఎన్టీఆర్ మరోసారి తన నటన లోని మరోకోణాన్ని బయటపెట్టాడని చెప్పుకొచ్చారు . సినిమాని చూస్తుంటే ఈ దసరా నందమూరి అభిమానులకి మరో వారం ముందుగానే వచ్చినట్టు కనిపిస్తుంది .