టాలీవుడ్‌లో సంచలనం సృష్టిస్తున్న వీరరాఘవరెడ్డి ..నాలుగు రోజుల కలెక్షన్ ఎంతో తెలుసా ..

 

టాలీవుడ్ యంగ్ టైగ‌ర్, మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ క‌ల‌యిక‌లో వ‌చ్చిన అర‌వింద స‌మేత వీర రాఘ‌వ చిత్రం బాక్సీఫీసు ద‌గ్గ‌ర తొలి మూడు రోజుల్లో రూ.57.5 కోట్ల‌కు పైగా షేర్‌ను, రూ.96 కోట్ల‌కు పైగా గ్రాస్‌ను అందుకుని సంచ‌ల‌నం సృష్టించింది. నాలుగో రోజు మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి గ్రోత్‌ను సాధించి స్ట‌డీ క‌లెక్ష‌న్ల‌తో దూసుకుపోయింది. దాంతో రోజు ముగిసే స‌మ‌యానికి ఆరున్న‌ర కోట్ల నుంచి రూ.7 కోట్ల వ‌ర‌కు షేర్‌ను, వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ.9 కోట్ల వ‌ర‌కు షేర్‌ను అందుకున్న ఈ సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా రూ.16 కోట్ల రేంజ్‌లో గ్రాస్‌ను అందుకుంద‌ని స‌మాచారం.

దాంతో మొత్తం మీద ఈ సినిమా నాలుగు రోజుల వీకెండ్‌కు గాను టోట‌ల్ వ‌ర‌ల్డ్ వైడ్ గా రూ.110 కోట్ల గ్రాస్‌ను అధిగ‌మించిన‌ట్టుగా స‌మాచారం. నాలుగు రోజుల్లో అత్య‌ధిక వేగంగా రూ.110 కోట్ల గ్రాస్‌మార్క్‌ను అందుకున్న సినిమాల‌లో ఒక‌టిగా నిలిచింది అర‌వింద స‌మేత వీర రాఘ‌వ చిత్రం. బాక్సాఫీసు ద‌గ్గ‌ర ఈ సినిమా సాధించిన క‌లెక్ష‌న్లు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కెరీర్‌లో ఫాస్టెస్ట్ వంద కోట్ల గ్రాస్ మార్క్‌ను అందుకున్న సినిమాగా నిల‌వ‌డ‌మే కాకుండా ప్ర‌స్తుతానికి నాలుగు రోజుల్లో ట్రేడ్ లెక్క‌ల ప్ర‌కారం సినామా రూ.65 కోట్ల రేంజ్‌లో షేర్‌ను వ‌సూలు చేసిన‌ట్టు స‌మాచారం అందుతుంది.