మరోసారి కౌశల్ పై దాడికి దిగిన హౌస్ మేట్స్ …..హౌస్ మేట్స్ కి సపోర్ట్ గా నిలిచి ,కౌశల్ ని టార్గెట్ చేసిన బిగ్ బాస్ ….!

bigg boss mi isuka jagratta task,kaushal ,Bigg boss ,TrendingAndhra

తెలుగు బిగ్ బాస్ సీజన్ 2 ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారింది. ఈ పోటీలో గెలుస్తాడని అందరూ భావిస్తున్న కౌశల్ పై ఓ టాస్క్ లో మిగతా కంటెస్టెంట్స్ అందరూ కలిసి మూకుమ్మడి దాడి చేయగా, అందరినీ హెచ్చరించిన బిగ్ బాస్, ఆ టాస్క్ ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించాల్సి వచ్చింది.

మీ ఇసుక జాగ్రత్త పేరిట ఈ టాస్క్ ని ఇచ్చాడు బిగ్ బాస్ , ఈ టాస్క్ లో తనీష్, కౌశల్ లు శారీరక హింసకు పాల్పడ్డారు. డైరెక్ట్ ఫినాలేకు వెళ్లే అవకాశాన్ని బహుమతిగా ఇచ్చే టాస్క్ లో భాగంగా, ఇసుక కంటెయినర్ లోని ఇసుకను కాపాడుకుంటూ ఉండాలి. దాన్ని మిగతావారు కింద పడేసే ప్రయత్నం చేస్తుండాలి.

ఈ టాస్క్ రెండు లెవల్స్ లో సాగుతుంది. తొలి దశలో కౌశల్ కంటెయినర్ ను పడేయటానికి సామ్రాట్, తనీష్ లు పెద్ద ప్రయత్నమే చేశారు. వీరిద్దరూ రోల్ రైడాకు మద్దతుగా నిలిచి , కౌశల్ పై దాడి కి దిగారు . ఈ క్రమంలో తనీష్, కౌశల్ ఒకరిని ఒకరు నెట్టుకున్నారు. కంటెయినర్ రాడ్స్ విరగ్గొట్టడం, అద్దాలు పగులగొట్టడం వంటివి జరిగాయి. దీంతో రంగంలోకి దిగిన బిగ్ బాస్, శారీరక హింస జరుగుతోందని, అందరినీ బయటకు పంపిస్తానని హెచ్చరించాడు . ఆపై టాస్క్ ను మధ్యలోనే రద్దు చేసి, హౌస్ మేట్స్ పై ఫైర్ అయ్యాడు . ఇన్ని రోజులు అవుతున్న కూడా బిగ్ బాస్ చెప్పిన దానిని వినకుండా వస్తున్నారు అని అన్నాడు . దీనితో ఈ పోటీలో రోల్ గెలిచాడని చెబుతూ, అతన్ని లెవల్ 2 పోటీకి పంపుతున్నట్టు బిగ్ బాస్ ప్రకటించాడు.