అవన్నీ రూమర్స్ అంటున్న స్వాతి…

అవన్నీ రూమర్స్ అంటున్న స్వాతి…
ఈ నెల 30న హీరోయిన్ స్వాతి పెళ్లి పీట‌లెక్క‌నున్న సంగ‌తి మనకి తెలిసిందే. మలేషియన్ ఎయిర్లైన్స్ లో పైలట్ గా విధులు నిర్వహిస్తున్న వికాస్‌ను పెళ్లి చేసుకోనుంది. ఈ పెళ్లి త‌ర్వాత స్వాతి జ‌కార్తాలో సెటిల్ అవుతుంద‌ని.. సినిమాలు మానేస్తుంద‌ని వార్త‌లు వినిపించిన సంగ‌తి సోషల్ మీడియాలో చాల పోస్ట్లు వెలిసాయి. అయితే ఈ విష‌యంపై స్వాతి స్పందించింది.

తాను పెళ్లి చేసుకుంటున్నాన‌ని. అంత మాత్రానికే తాను సినిమాలు మానేస్తున్నాన‌ని వార్త‌లు రావ‌డం త‌న‌కు షాక్ ఇచ్చింద‌ని స్వాతి తెలిపింది. పెళ్లి త‌ర్వాత కూడా స్వాతి సినిమాల్లో న‌టిస్తుంది. ప్ర‌స్తుతం స్క్ర్రిప్ట్స్ వింటున్నాన‌ని న‌చ్చితే త‌ప్ప‌కుండా సినిమాలు చేస్తాన‌ని తేల్చేసింది. త్వ‌ర‌లోనే స్వాతి తెలుగులో ఓ సినిమా చేయ‌నుంద‌ని తాజా స‌మాచారం.