ముద్దు సన్నివేశాలపై దిల్‌ రాజుఏమన్నాడంటే …!

dil raju , trendingandhraప్రేక్షకులు మంచి, చెడు మరిచి కేవలం వినోదం కోసమే సినిమాలు చూస్తున్నారని
ప్రముఖ నిర్మాత దిల్‌రాజు అన్నారు. ముద్దు సన్నివేశాలు లేనిదే సినిమాలు
చూడటం లేదని అభిప్రాయపడ్డారు. ప్రముఖ నిర్మాత బెక్కం వేణుగోపాల్
నిర్మిస్తున్న ‘హుషారు’ ఈ చిత్రంలోని పాట విడుదల కార్యక్రమానికి
దిల్‌రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

dil raju , trendingandhra

ఈ సందర్భంగా ‘హుషారు’ చిత్ర పోస్టర్‌పై ఉన్న చెడు వింటాను, చెడు
మాట్లాడుతాను, చెడు చూస్తానన్న వ్యాఖ్యలపై దిల్‌రాజు అసంతృప్తి వ్యక్తం
చేశారు. ప్రేక్షకులు కేవలం వినోదానికే ప్రాధాన్యం ఇస్తున్నారని
పేర్కొన్నారు. తన సినిమాల ద్వారా మంచి చెప్పడానికి ప్రయత్నిస్తుంటే..
చెడు సినిమాల ప్రచారంలో పాల్గొనాల్సి వస్తోందని, ప్రేక్షకులు కూడా
అలాంటివే కోరుకుంటున్నారని అన్నారు. భవిష్యత్‌లో తాను కూడా అదే దారి
ఎంచుకుంటానేమోనని వ్యాఖ్యానించారు.

dil raju , trendingandhraదిల్‌రాజు నిర్మాతగా అనేక కుటుంబ కథా చిత్రాల్ని ప్రేక్షకులకు అందించారు.
కంటెంట్‌ ఉన్న చిన్న సినిమాల్ని కూడా ఆయన ప్రోత్సహిస్తుంటారు. 2017లో ఆయన
నిర్మాతగా విడుదలైన ‘శతమానం భవతి’, ‘డీజే: దువ్వాడ జగన్నాథమ్‌’, ‘ఫిదా’,
‘రాజా ది గ్రేట్‌’, ‘ఎంసీఏ’ సినిమాలు మంచి టాక్‌ అందుకున్నాయి.