గూఢచారి టీం చేతిలో దారుణంగా మోసపోయిన జగపతిబాబు…!

జగపతిబాబు ఒకప్పుడు ఫ్యామిలీ సినిమాలకి కేరాఫ్ అడ్రస్ . అయన గూఢచారి సక్సెస్ మీట్‌లో మాట్లాడుతూ నేను ఇండస్ట్రీకి వచ్చి 30 సంవత్సరాలవుతోందని జగపతి బాబు అన్నారు. తనకు లైఫ్‌లో యాక్టింగ్ రాదని కేవలం కెమెరా ముందు మాత్రమే యాక్టింగ్ చేయగలనని ఆయన చెప్పారు. గూఢచారి సక్సెస్ మీట్‌లో ఆయన మాట్లాడుతూ ‘‘గూఢచారి’ టీం విషయానికి వస్తే ప్రొడ్యూసర్స్ టు అభిషేక్స్ స్క్వేర్, వివేక్, విశ్వాగారు, అనిల్ గారు వీరందరూ ఈ సినిమాను సపోర్ట్ చేశారు. సినిమా ప్రారంభించిన రోజున శేష్ స్టార్ కాదు. ఈ రోజు స్టార్.

అటువంటిది శేష్‌ని, శశిని నమ్మి సినిమా చేశారంటే నమ్మకం. నేనూ నమ్మకంతోనే చేశాను. సినిమా చూశాక డబ్బులు తీసుకోకుండా చేసుంటే బాగుండేది అనిపించింది. కానీ తిరిగివ్వడానికి మనసు రాలేదు. సినిమా కోసం అందరూ కష్టపడతారు కానీ ఈ సినిమా టీం అంతా గొడ్డు చాకిరి చేసింది. సీరియల్ కంటే చిన్న టీం.. ఎక్విప్ మెంట్ లేదు. కనీసం కూర్చోడానికి సరిగా కుర్చీ కూడా లేదు. సినిమా అనేది మైండ్‌కి, సోల్‌కి కనెక్టెడ్ కానీ.. డబ్బుకి కనెక్టెడ్ కాదు అని నేనెప్పుడూ చెబుతుంటాను.

ఎక్కువ డబ్బు పెడితే సినిమా ఆడుతుందనేది స్టుపిడిటి. ఈ సినిమాకు వీళ్లు చేసిన కష్టం చూస్తుంటే నాకు ఎంతో ముచ్చటేసింది. వీళ్లు చాలా పెద్ద చీటర్సండి అంటూ నవ్వుతూ చెప్పాడు. విపరీతమైన చీటింగ్. లొకేషన్స్ దగ్గర నుంచి ప్రతిదీ చీటింగే. నన్ను కూడా చీట్ చేశారు. నాకు తెలియకుండా నా షాట్స్ ఎన్నో ఉన్నాయి ఈ సినిమాలో. దానికి కూడా తెలివి కావాలండి. మంచి చీటింగ్ ఎప్పుడూ కూడా అప్రిషియేటెడ్. అందరి ఫ్యాన్స్‌కీ థాంక్యూ వెరీ మచ్’’ అని జగపతిబాబు గారు తెలిపారు.