పాట‌లు పాడితే రాయ‌ల్టీ చెల్లించాల్సిందే..!

ilayaraja latest news,trendingandhra
 
ఇళ‌య‌రాజా పాట లేకుండా  మ్యూజిక‌ల్ నైట్ సాగ‌దు. ఆర్కెస్ట్రా ఎన్ని పాట‌లు పాడినా మ్యాస్ట్రో సాంగ్స్ ఆల‌పించ‌కుంటే అంస‌పూర్ణ‌మే అవుతుంది.   కార్య‌క్ర‌మం ఏదైనా ఇళ‌య‌రాజా పాట ఉండాల్సిందే. ఇలాంటి వేడుక‌ల్లో  గాయ‌నీ గాయ‌కులు   మెజూషియ‌న్స్ పారితోష‌కం తీసుకుని ఫ‌ర్ఫామెన్స్ చేస్తారు. ఈ క్ర‌మంలో తన వాటా త‌న‌కు ఇవ్వ‌మ‌ని అడుగుతున్నారు మాస్ట్రో. తాను అడుగుతున్న‌ది కొంత న‌గ‌దు మాత్ర‌మే. ఈ సొమ్ము మున్ముందు త‌రాల‌కు ఉప‌యోగ‌ప‌డుతుందంటూ వీడియో పోస్టు చేశారు ఇళ‌య‌రాజా.
 
త‌న అనుమ‌తి లేకుండా పాడితే చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటానంటున్నాడు ఇళ‌య‌రాజా. వీడియోలో ఆయ‌న మాట్లాడుతూ నా ప‌ర్మీషన్ లేకుండా పాట‌లు పాడుతున్న గాయ‌నీ గాయ‌కుల‌కు మ్యూజీషియ‌న్స్‌కి ఇదే నా విన్న‌పం. నా పాట‌లు పాడొద్ద‌న‌డం లేదు. రాయ‌ల్టీ చెల్లించి త‌న అనుమ‌తిని తీసుకోవాల్సిందేన‌ని విన్న‌వించారు. 
 
రాయ‌ల్టీ చెల్లించి త‌న అనుమ‌తి తీసుకోవాల్సిందేన‌ని విన్న‌వించారు మాస్ట్రో. చాలా మంది మ్యూజిక్ డైరెక్ట‌ర్స్ రాయ‌ల్టీ విష‌యాన్ని లైట్‌గా తీసుకున్నా ఇళ‌య రాజా మాత్రం సీరియ‌స్‌గా తీసుకున్నారు. గ‌తంలో బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం అమెరికా టూర్‌లో మాస్ట్రో పాట‌లు పాడ‌గ నోటీసులు అందుకోవ‌డం అప్ప‌ట్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఈ సారి ఏకంగా వీడియోను రిలీజ్ చేసి సింగ‌ర్స్ మ్యుజీషియ‌న్స్‌ను హెచ్చ‌రిస్తూ చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటానంటున్నారు.
 
మ‌రి పెద్దాయ‌న మాట‌లు మ‌న్నించి ఆయ‌న పాట‌లు పాడ‌టం మానేస్తారా..?  లేదంటే టేకిటీజీ అంటూ నోటీసులు అందుకుంటారా..?   మొత్తానికి రాయ‌ల్టీ విష‌యంలో సీరియ‌స్‌గా ఉన్నారు ఇళ‌య‌రాజా.