జ‌బ‌ర్ద‌స్త్‌కు అన‌సూయ గుడ్ బై..!

anasuya bharadwaj,trendingandhra
 
తెలుగు వెండితెర‌, బుల్లితెర‌పై అన‌సూయ‌ది ప్ర‌త్యేక స్థానం. అటు స్టార్ యాంక‌ర్‌గా రాణిస్తూనే మ‌రో ప‌క్క ప్రాధాన్య‌త ఉన్న పాత్ర‌ల్లో న‌టిస్తూ త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపును తెచ్చుకుంది. యాంక‌ర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన తొలినాళ్ల‌లో ఎన్నో ఒడిదుడుకుల‌ను ఎదుర్కొన్న‌ప్ప‌టికి సినీ లోకాన్ని త‌నవైపు తిప్పుకోవ‌డంలో అన‌సూయ విజయం సాధించింద‌ని చెబుతున్నారు సినీ జ‌నాలు. 
 
 
అలా, న‌ట‌న‌లోను, యాంక‌రింగ్‌లోనూ త‌న‌కు బ‌దులుగా మ‌రొక‌రిని రీప్లేస్ చేసేందుకు మ‌రెవ్వ‌రు లేరంటోన్న అన‌సూయ‌కు వ‌ర్షిణి షాక్ ఇచ్చిందంటూ ఇటీవ‌ల సోష‌ల్ మీడియా కోడై కూస్తోంది. అయితే, బుల్లితెర‌పై జ‌బ‌ర్ద‌స్త్ ప్రోగ్రామ్‌కు ఎంత క్రేజ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆ ప్రోగ్రాంలో పాటిస్పేట్ చేసే క‌మెడియ‌న్స్‌కు, యాంక‌ర్స్‌కు, జ‌డ్జీల‌కు అంతే క్రేజ్ తెచ్చిపెట్టింది జ‌బ‌ర్ద‌స్త్‌. ఆ కోవ‌లో ర‌ష్మీ, అన‌సూయ కూడా ఒక‌రు. 
anasuya bharadwaj,trendingandhra
 
 
జ‌బ‌ర్ద‌స్త్ ప్రారంభంలో యాంక‌రింగ్ చేసిన అన‌సూయ ఒక్క‌సారిగా మ‌ధ్య‌లో త‌ప్పుకోవ‌డంతో ర‌ష్మీ గౌత‌మ్ ఎంట్రీ ఇచ్చింది. మ‌ళ్లీ అన‌సూయ ఎంట్రీ ఇవ్వ‌డంతో జ‌బ‌ర్దస్త్‌, ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ద‌స్త్‌గా ఇద్ద‌రూ యాంక‌రింగ్‌ను పంచుకున్న సంగ‌తి తెలిసిందే. అంతేకాకుండా, క‌మెడియ‌న్ల సంఖ్య కూడా పెరిగింది.
 
అయితే, జ‌బ‌ర్ద‌స్త్ ప్రారంభంలో జ‌రిగిన‌ట్టే ఇప్పుడు మ‌ళ్లీ ప్రోగ్రాం నుంచి త‌ప్పుకుంది అన‌సూయ‌. అన‌సూయ ప్లేస్‌లో వ‌ర్షిణి ఎంట్రీ ఇచ్చింది. గ‌త నాలుగు ఎపిసోడ్స్ నుంచి జ‌బ‌ర్ద‌స్త్‌కి వ‌ర్షిణీనే హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తోంది. అంతేకాకుండా, అన‌సూయ యాంక‌రింగ్‌కు వ‌చ్చినంత రెస్పాన్స్‌.. సేమ్ వ‌ర్షిణికి కూడా ల‌భిస్తోంది. ఇలా ఇన్నాళ్ల‌కు అన‌సూయ‌ను రీప్లేస్ చేసే లేడీ యాంక‌ర్ రావ‌డంతో, అందులోను అన‌సూయ‌తో పోల్చితే వ‌ర్షిణి పారితోష‌కం కూడా త‌క్కువ కావ‌డంతో.. వ‌ర్షిణీనే కంటిన్యూ చేసే ఆలోచ‌న‌లో ప‌డ్డ‌ద‌ట జ‌బ‌ర్ద‌స్త్ యాజ‌మాన్యం అంటూ సోష‌ల్ మీడియాలో క‌థ‌నాలు ప్ర‌చురిత‌మ‌వుతున్నాయి. ఇదే గ‌నుక జ‌రిగితే జ‌బ‌ర్ద‌స్త్ అభిమానులు అన‌సూయ‌ను మ‌రిచిపోవ‌డం ఖాయం..!