బాబాయ్, వాళ్ల నాన్న గారిలా…నేను, మా నాన్నగారిలా…..!

kalyan ram , trendingandhra

తన తండ్రి నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా బాలకృష్ణ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న బయోపిక్ ‘ఎన్టీఆర్’. ఎన్టీఆర్ జీవిత చరిత్రను సినీ, రాజకీయ రంగాల వారీగా విభజించి రెండు పార్ట్‌లుగా తెరకెక్కిస్తున్నారు దర్శకుడు క్రిష్ జాగర్లమూడి. ఈ చిత్రం షూటింగ్‌లో నేటి నుంచి కల్యాణ్ రామ్ పాల్గొంటున్నారు. ఈ విషయాన్ని తనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

kalyan ram ,trendingandhra

తన తండ్రి హరికృష్ణ పాత్రలో కల్యాణ్ రామ్ కనిపించబోతున్నారు. ‘‘30 ఏళ్ల క్రితం మా బాబాయ్‌తో ‘బాలగోపాలుడు’ సినిమాలో బాలుడిలా నటించాను. మళ్లీ ఇప్పుడు .. ‘బాబాయ్, వాళ్ల నాన్న గారిలా… నేను, మా నాన్నగారిలా’’ ఎన్టీఆర్ బయోపిక్‌లో నటిస్తున్నానంటూ కల్యాణ్‌ రామ్ ట్వీట్‌లో వెల్లడించాడు. కల్యాణ్ రామ్‌కు సంబంధించిన స్టిల్‌ని కూడా చిత్రబృందం విడుదల చేసింది.