ఎన్టీఆర్ కథానాయకుడుగా రానున్న ఎన్టీఆర్ బయోపిక్

Krish , NTR Biopic , NTR Kathanayakudu
తన తండ్రి పాత్రలో బాలకృష్ణ నటిస్తుండగా, క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం టైటిల్ ను ఈ ఉదయం అనౌన్స్ చేశారు. ఈ సినిమాకు ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ అని పేరు పెట్టినట్టు జాగర్లమూడి క్రిష్, తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించాడు.

NTR Biopic ,TrendingAndhra

“ప్రతి కథకీ ఓ నాయకుడుంటాడు.. కానీ కథగా మారే నాయకుడొక్కడే వుంటాడు” అని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించాడు. ఎన్టీఆర్ జానపద చిత్రాలు చేస్తున్న వేళ, ఎలా ఉంటాడో చూపుతూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. జనవరి 9న చిత్రం విడుదల కానున్న సంగతి తెలిసిందే. నేడు విడుదల చేసిన ఎన్టీఆర్ బయోపిక్ టైటిల్ పోస్టర్ ను మీరూ చూడండి.