అజ్ఝాతంలోకి వెళ్లిన నానా పటేకర్ …!

బాలీవుడ్ లో తనుశ్రీ దత్తా – నానా పటేకర్ ల వివాదం రోజు రోజుకి ముదురుతోంది. ఈ ఏపీసోడ్ లో కొందరు తనుశ్రీని సపోర్టు చేస్తుంటే.. మరికొందరు మాత్రం నానాకు అండగా నిలుస్తున్నారు. ఐతే, తనుశ్రీకి సపోర్టు ఎక్కువగా కనిపిస్తోంది. ఆమెకు ట్వింకిల్‌ ఖన్న, సోనమ్‌ కపూర్‌, ప్రియాంక చోప్రా. అర్జున్‌ కపూర్‌, సల్మాన్‌ ఖాన్‌, అమీర్‌ ఖాన్‌, ఫర్హాన్‌ అక్తర్‌లు.. తదితరులు తనుశ్రీకి సపోర్టుగా నిలిచారు. ఇదిలా ఉండగా.. సడెన్ గా నానా పటేకర్ అజ్ఝాతంలోకి వెళ్లిపోయాడన్న న్యూస్ షాక్ కి గురి చేస్తోంది.

Nanapatekar, Trendingandhra

ప్రస్తుతం నానా పటేకర్ ‘హౌజ్‌ఫుల్‌ 4’లో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కోసం చిత్రబృందం గురువారం జైసల్మేర్ బయలుదేరి వెళ్లింది. ఐతే, నానా చిత్రబృందంతో కలవలేదట. అసలు ఎక్కిడికి వెళ్లింది కూడా చెప్పలేదట. దీంతో.. నానాపై చిత్రీకరించాల్సిన సన్నివేశాలని పక్కకు పెట్టి మిగితా వాటిని పూర్తి చేసే పనిలో చిత్రబృందం ఉన్నట్టు తెలిసింది.

Nana-Patekar, Trendingandhra

మరోవైపు, ఈ ఏపీసోడ్ లో నానా పటేకర్ తనుశ్రీ దత్తకు లీగల్ నోటీసులు పంపారు. తనుశ్రీ దత్తా తనపై చేసిన తప్పుడు ఆరోపణలకు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు పటేకర్ తన న్యాయవాది రాజేంద్ర శిరోద్కర్ ద్వారా తనుశ్రీ దత్తాకు నోటీసులు పంపారు.