జెర్సీ’ ని ప్రారంభించిన నాని

naturalstar nani,naturalstar nani new movie,nani new movie,nani upcoming movie,nani movie jersey movie

దేవదాస్ సినిమా తర్వాత హీరో నాని కాస్త విరామం తీసుకున్నాడు. నాగార్జునతో కలిసి చేసిన మల్టీస్టారర్ మూవీ దేవదాస్‌ మంచి సక్సెస్‌ను సాధించింది. ఈ సినిమా షూటింగ్‌ దశలో ఉండగానే ‘జెర్సీ’ సినిమా కోసం నాని సైన్ చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రం నేడు పూజా కార్యక్రమాలు జరుపుకుంది.

naturalstar nani,naturalstar nani new movie,nani new movie,nani upcoming movie,nani movie jersey movie

ఈ సినిమాలో నాని సరసన శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ ముద్దుగుమ్మ కన్నడలో రూపొందిన ‘యూటర్న్’ మూవీలో ప్రధాన పాత్రలో నటించింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపొందనున్న ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ క్లాప్ కొట్టారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. క్రీడా నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ మూవీకి వంశీ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ‘జెర్సీ’ రేపటి నుంచే షూటింగ్ జరుపుకోనుంది.