కత్తులతో కదం తొక్కుతున్న మెగాపవర్ స్టార్…బోయపాటి సినిమా ఫోటోలు లీక్!

 

మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం బోయపాటి దర్శత్వంలో నటిస్తున్నాడు. భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం రూపొందుతోంది. బోయపాటి శ్రీను తనదైన శైలిలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. బోయపాటి సినిమా అంటే రోమాలు నిక్కబొడుచుకుని పోరాట సన్నివేశాలు ఉంటాయి. దీనితో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

ఇటీవలే అజర్బైజాన్ లో కీలక షెడ్యూల్ పూర్తి చేసుకుని ఇండియా వచ్చారు. తాజాగా మరో షెడ్యూల్ వైజాగ్ లో ప్రారంభమైంది. అభిమానులంతా రాంచరణ్, బోయపాటి సినిమా ఫస్ట్ లుక్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం ప్రారంభమై చాలా రోజులు గడుస్తున్నా ఇంతవరకు ఫస్ట్ లుక్ విడుదల చేయలేదు. దసరాకు ఫస్ట్ లుక్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆయుధం చేతపట్టి ఈ చిత్రం ప్రస్తుతం వైజాగ్ లో షూటింగ్ జరుపుకుంటోంది. రాంచరణ్ పోరాట సన్నివేశాలకి సంబందించిన స్టిల్స్ సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి.

ఆయుధం చేతబట్టి ఉన్న రాంచరణ్ పోరాట సన్నివేశాలకు సంబంధించిన దృశ్యాలు ఆసక్తిరేపే విధంగా ఉన్నాయి. రౌడీ గ్యాంగ్ కు, రాంచరణ్ కు మధ్య ఫైట్ సీన్ ని బోయపాటి చిత్రీకరిస్తున్నారు. సింహాచలం అప్పన్న సన్నిధిలో వైజాగ్ లో షూటింగ్ సందర్భంగా రాంచరణ్, బోయపాటితో కలసి చిత్ర యూనిట్ సింహాచలం అప్పన్న స్వామిని దర్శించుకున్నారు. ఆలయంలో రాంచరణ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీనికి సంబందించిన ఫోటోలు కూడా వైరల్ గా మారాయి. భారీ తారాగణం ఈ చిత్రంలో రాంచరణ్ సరసన కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ ప్రముఖ నటుడు వివేక్ ఒబెరాయ్ ఈ చిత్రంలో విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఆర్యన్ రాజేష్, సీనియర్ హీరోయిన్ స్నేహ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. డివివి దానయ్య ఈ చిత్రానికి నిర్మాత. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నాడు.