మరో వివాదం లో సర్కార్ …!

Sarkar in another controversy ...,sarkar controversy,trendingandhra,tamil movie sarkar,actor vijay new movie sarkar,trendingandhra

స్టార్ హీరో విజయ్ – మురుగదాస్ కలయికలో తెరకెక్కిన సర్కార్ చిత్రం రేపు వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా విడుదల కాబోతుంది. మొన్నటి వరకు ఈ చిత్ర కథ విషయంలో పెద్ద దుమారమే చెలరేగి సద్దుమణిగింది. ఈ వివాదం సద్దుమణిగింది అనుకునే టైం లో మరో వివాదం మొదలు అయ్యింది. ఈ సినిమాను గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక్క తమిళనాడులోనే 700 స్క్రీన్స్ కు పైగా ప్లాన్ చేస్తున్నారు. ఈ తరుణంలో ఒక డిస్ట్రిబ్యూటర్ ‘సర్కార్’ పై ప్రతీకారం తీర్చుకుంటున్నాడు.

ఈ చిత్రం చంగల్ పేట్ ఏరియా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ను డిస్ట్రిబ్యూటర్ నిర్మాత కాల్పతి అఘోరామ్ కోరుకున్నాడు. కాని సన్ నెట్వర్క్ వారు మాత్రం మరో డిస్ట్రిబ్యూటర్ కు ఆ రైట్స్ ను అమ్మడం జరిగిందట. దాంతో కాల్పతి సర్కార్ చిత్రంపై కోపం పెంచుకున్నాడు. తనకు రైట్స్ ఇవ్వనందుకు తన వద్ద ఉండే థియేటర్లలో ఆ చిత్రాన్ని ప్రదర్శించేందుకు నో చెబుతున్నాడు. అదే జరిగితే ‘సర్కార్’ సినిమా ఓపెనింగ్స్ విషయంలో నష్టపోవాల్సి వస్తుందని నిర్మాతలు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ఇతర డిస్ట్రబ్యూటర్స్ ఈయన తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

ఇక తెలుగు విషయానికి వస్తే అశోక్ వల్లభనేని సర్కార్ తెలుగు రైట్స్ సొంతం చేసుకొని , రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 750 థియేటర్స్ లలో ఈ సినిమాను విడుదల చేస్తున్నాడు.