సోనాక్షి సిన్హాపై చీటింగ్ కేసు న‌మోదు

sonakshi sinha latest movie news,trendingandhra
 
సోనాక్షి సిన్హా. బాలీవుడ్‌లోకి తెరంగ్రేటం చేసిన స‌మ‌యంలో స్టార్ హీరోల స‌ర‌స‌న వ‌రుస ఆఫ‌ర్ల‌ను ద‌క్కించుకుని స్టార్ హీరోయిన్ స్టేటస్ సొంతం చేసుకుంది. బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్ స‌ర‌స‌న ద‌బాంగ్‌, దంబాగ్ – 2 చిత్రాల‌తోపాటు అక్ష‌య్ కుమార్ స‌ర‌స‌న రౌడీ రాథోడ్‌, అజ‌య్ దేవ‌గ‌న్ హీరోగా తెర‌కెక్కిన స‌న్ ఆఫ్ స‌ర్దార్ వంటి చిత్రాల్లో న‌టించి వ‌రుస హిట్స్‌ను సొంతం చేసుకుంది. 
 
అయితే, ఆ స‌క్సెస్ సోనాక్షి సిన్హాకు ఎంతోకాలం నిల‌వ‌లేదు. ఇటీవ‌ల కాలంలో తాను న‌టించిన సినిమాలు వ‌రుసగా ఫ్లాప్ టాక్‌ను మూట‌గ‌ట్టుకుంటున్నాయి. దీంతో ఈ అమ్మ‌డుకు ఛాన్స్‌లు కూడా త‌గ్గిపోయాయి. ఇక సౌత్ సినీ ఇండ‌స్ట్రీలో రాణిద్దామ‌నుకున్న‌ప్ప‌టికీ గ‌తంలో ర‌జ‌నీ స‌ర‌స‌న హీరోయిన్‌గా న‌టించిన‌ లింగ మూవీ కాస్తా డిజాస్ట‌ర్ టాక్‌ను సొంతం చేసుకుంది. దీంతో ఈ భామ‌కు నార్త్‌, సౌత్ సినీ ఇండ‌స్ట్రీల్లో ఛాన్సులు క‌రువ‌య్యాయి.
 
ఇలా పీక‌ల్లోతు క‌ష్టాల్లో ఉన్న సోనాక్షి సిన్హాపై తాజాగా ఓ కేసు న‌మోదైంది. సినీ న‌టుల‌కు అవార్డుల‌ను ప్ర‌దానం చేసే ఓ కంపెనీ సోనాక్షి సిన్హాతోపాటు మ‌రో ఆరుగురిపై పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఫిర్యాదులో ఆ కంపెనీ పేర్కొన్న వివ‌రాలు ఇలా ఉన్నాయి. తాము ప్ర‌తీ సారి నిర్వ‌హించే ప్యాష‌న్ షోలో భాగంగానే, ఇటీవ‌ల ఢిల్లీలో కూడా ఓ షోను నిర్వ‌హించామ‌ని, ఆ షోకు సోనాక్షి సిన్హాను ముఖ్య అతిధిగా ఆహ్వానించిన‌ట్టు చెప్పారు. 
 
అయితే, సోనాక్షి సిన్హా డిమాండ్ మేర‌కు ఆమె ఖాతాలో రూ.28 లక్షలు జ‌మ చేయ‌డంతోపాటు, ఆమె వ‌చ్చి పోయేందుకు రెండు ఫ్లైట్ టికెట్స్‌, కార్య‌క్ర‌మానికి వ‌చ్చిన స‌మ‌యంలో ఆమె కోసం ప్ర‌త్యేక రూము ఇలా మ‌రో 9 ల‌క్ష‌ల రూపాయ‌ల‌తో సౌక‌ర్యాల‌ను ఏర్పాటు చేశామ‌ని తెలిపారు. చివ‌ర‌కు త‌న‌ షెడ్యూల్ బిజీ కార‌ణంగా షోకు హాజ‌రు కాలేనంటూ సోనాక్షి సిన్హా చెప్పింద‌ని ఫిర్యాదులో పేర్కొన్నారు. త‌మ కార్య‌క్ర‌మానికి హాజ‌రు కాలేదు కాబట్టి జ‌మ చేసిన డ‌బ్బులు తిరిగి ఇచ్చేయ్యాలంటూ అడిగిన త‌మ‌ను చంపేస్తామంటూ సోనాక్షి సిన్హా మేనేజ‌ర్ బెదిరింపుల‌కు పాల్ప‌డుతున్నాడ‌ని, త‌మ‌కు పోలీసులే న్యాయం చేయాలంటూ స‌ద‌రు కంపెనీ వారు సోనాక్షి సిన్హా, ఆమె మేనేజ‌ర్‌, మ‌రో ఐదుగురిపై పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. కంపెనీ ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.