సుధీర్ బాబు జోడీగా మెహ్రీన్ …పట్టాలెక్కిన మరో మూవీ…..!

రొటీన్ కి భిన్నమైన కథాకథనాలకు ప్రాధాన్యతనిస్తూ, సుధీర్ బాబు ఒక్కో సినిమాను చేసుకుంటూ వెళుతున్నాడు. ఈ మధ్య ఆయన చేసిన సమ్మోహనం సినిమా భారీ విజయాన్ని సాధించింది. త్వరలోనే ఆయన నన్నుదోచుకుందువటే సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నాడు.

ఈ నేపథ్యంలో ఆయన తాజాగా మరో దర్శకుడు పులి వాసుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.
ఈ కాంబినేషన్లోని సినిమా కొంతసేపటి క్రితం హైదరాబాద్ – రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలను జరుపుకుంది. ఈ సినిమాలో సుధీర్ బాబు సరసన కథానాయికగా మెహ్రీన్ నటిస్తుంది .

ప్రముఖ దర్శకులు పరుచూరి గోపాలకృష్ణ కెమెరా స్విచ్చాన్ చేయగా దిల్ రాజు క్లాప్ ఇవ్వగా , ముహూర్తపు సన్నివేశానికి వినాయక్ గౌరవ దర్శకత్వం వహించారు. తమన్ సంగీతాన్ని అందిస్తోన్న ఈ సినిమాలో సీనియర్ యాక్టర్స్ రాజేంద్ర ప్రసాద్ , పోసాని కృష్ణ మురళి సీనియర్ నరేశ్ ముఖ్యమైన పాత్రలను పోషించనున్నారు.