సెకండ్ ఇన్నింగ్ లో అదరకొడుతున్న తారలు

tollywood heroines second innings,tollywood heroines second innings movies,trendingandhra,anjala zaveri,bhoomika

అంజలా జవేరి
విక్టరీ వెంకటేష్ నటించిన ప్రేమించుకుందాం రా చిత్రం తో తెలుగు తెరకు పరిచయమైంది అంజలా జవేరి. సురేష్ బాబు నిర్మించిన ఈ చిత్రం తెలుగు లో మొట్ట మొదటి ఫ్యాక్షన్ చిత్రం గా జయంత్ సి పరాన్జీ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. అంజలా జవేరి నటించిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ నా నిలిచింది. ఈ మూవీ అంజలా నటనకు మంచి మార్కులు పడ్డాయ్.ఆ తరువాత చిరంజీవి తో చూడాలని వుంది , నాగార్జున తో రావోయి చందమామ లాంటి చిత్రాల్లో నటించింది.ఈమె తెలుగు తో పాటు తమిళ్, కన్నడ, హిందీ చిత్రాల్లో కూడా నటించింది.2004 లో రాజాశేఖర్ తో చేసిన ఆప్తుడు సినిమా తెలుగు ఆమె ఆఖరి చిత్రం. మళ్ళీ ఎనిమిదేళ్ల గ్యాప్ తరువాత శేఖర్ కమ్ముల తెరకెక్కించిన లైఫ్ ఇస్ బ్యూటీఫుల్ చిత్రం తో గ్రాండ్ గా రిఎంట్రీ ఇచ్చింది.

tollywood heroines second innings,tollywood heroines second innings movies,trendingandhra,anjala zaveri,bhoomika

2) భూమిక
అక్కినేని నాగేశ్వరరావు మనవడు సుమంత్ హీరో గా కరుణాకరన్ తెరకెక్కించిన యువకుడు చిత్రం తో భూమిక డెబ్యూ హీరోయిన్ గా తెలుగు చిత్ర సీమకు పరిచయమైంది. పవన్ కళ్యాణ్ తో చేసిన ఖుషి చిత్రం తో భూమిక స్టార్ హీరోయిన్ గా మారింది. ఈమె ఏక కాలంలో తెలుగు , తమిళ్, కన్నడ, హిందీ, పంజాబీ, భోజపురి, మలయాళం ఇలా అన్ని భాషల్లో ఆమె నటించింది. తెలుగు లో ఒక్కడు, సింహాద్రి లాంటి బ్లాక్ బస్టర్ లో నటించింది. 2004 లో వచిన్న మిస్సమ్మ చిత్రం ఆమె కు బెస్ట్ యాక్ట్రెస్ అఫ్ ఫిమేల్ కు గాను ఆమె కు నంది అవార్డు తెచ్చిపెట్టింది.ఖుషి కి ఫిలింఫేర్ అవార్డు, నా ఆటోగ్రాఫ్ మూవీ లో భూమిక నటనకు సినీ మా అవార్డు ఫర్ బెస్ట్ యాక్ట్రెస్ ఇలా అనేక భాషల్లో ఆమె ఎన్నో అవార్డులు సాధించింది.అనసూయ , అమరావతి చిత్రం తో ఆమె నటన పరంగా మరో స్థాయికి చేరుకుంది.రకరకాలా భాషల్లో బిజీ గా వున్నా భూమిక నాని MCA మూవీ తో తెలుగు లో గ్రేట్ కం బ్యాక్ ఇచ్చింది. రీసెంట్ గా యూ టర్న్ , సవ్యసాచి చిత్రాలతో ఆమె మెప్పించింది.

3) నదియా
నదియా హీరోయిన్ గా మలయాళం లో మోహన్ లాల్ తో కలిసి నొక్కుతా దూరతు కణ్ణుమ్ నట్టు అనే చిత్రం తో మలయాళం లో అరంగేట్రం చేసింది. ఆమె ఎక్కువుగా మలయాళం , తమిళ్ సినిమాల్లో నటించింది. 1988 ఓ వచిన్న బజార్ రౌడీ తో తెలుగులో మహేష్ బాబు అన్నయ్య రమేష్ బాబు తో జత కట్టింది.ఆ వెంటనే వింత దొంగలు అనే చిత్రం లో కనిపించింది. తరువాత నదియా మళ్ళీ తెలుగు లో కనిపించలేదు. తెలుగు ప్రేక్షకులకు విశాల్ హీరో గా వచ్చిన భరణి చిత్రంతో పరిచయం ఏర్పడింది. ప్రభాస్ నటించి మిర్చి చిత్రం తో ప్రభాస్ కి అమ్మ గా నటించి తెలుగు లో మోస్ట్ వాంటెడ్ కారెక్టర్ ఆర్టిస్ట్ గా మారింది. తరువాత వరస ఆఫర్స్ తో అత్తారింటికి దారేది, అ.. ఆ … , నా పేరు సూర్య , నా ఇల్లు ఇండియా చిత్రాల్లో నటించింది.