విజ‌య్ దేవ‌ర‌కొండ‌పై జాన్వి మ‌న‌సులో మాట ఏమిటో తెలుసా..?

vijay devarakonda and janhvi kapoor,trendingandhra
శ్రీ‌దేవి కూతురు జాన్వి కోసం తెలుగు ఇండ‌స్ట్రీ ఎంత‌గానో ఎదురు చూసింది. డెబ్యూ మూవీ తెలుగు కావాల‌ని  చాలా మంది నిర్మాత‌లు, ద‌ర్శ‌కుడు ట్రై చేశారు. కానీ, హిందీ మూవీ ధ‌డ‌క్‌తో వెండితెర‌కు ప‌రిచ‌యం అయింది జాన్వి. ఆ త‌రువాత కూడా ఈ ప్ర‌య‌త్నాలు సాగినా టాలీవుడ్‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌లేదు.
 
ప్ర‌స్తుతం జాన్వి క‌పూర్ దృష్టంతా హిందీపైనే బాలీవుడ్‌లో తానేమిటో నిరూపించుకున్నాకే వేరే భాష‌ల్లో న‌టిస్తానంటోంది  జాన్వి. ఈ యంగ్ హీరోయిన్ మ‌న‌సంతా బాలీవుడ్‌పైనే ఉన్నా న‌చ్చిన హీరో మాత్రం విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ప్ర‌ముఖ నిర్మాత ద‌ర్శ‌కుడు క‌ర‌ణ్ జోహార్ వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న కాఫీ విత్ క‌ర‌ణ్ ప్రోగ్రామ్‌కు  జాన్వి అర్జున్ క‌పూర్‌తో క‌లిసి వ‌చ్చింది. 
 
 
ఓ రోజు న‌టుడిగా నిద్ర లేచే అవ‌కాశం వ‌స్తే నువ్వు ఏ న‌టుడిగా రావాల‌నుకుంటున్నావ‌ని  క‌ర‌ణ్ అడిగిన ప్ర‌శ్న‌కు ఆలోచించ‌కుండా విజ‌య్ దేవ‌ర‌కొండ పేరు చెప్ప‌డ‌మే కాదు విజ‌య్‌తో న‌టించాల‌నుకుంటుంది జాన్వి. ఈ లెక్క‌న జాన్విని తెలుగు వెండితెర‌కు పరిచ‌యం చేసే అవ‌కాశం ఒక్క విజ‌య్‌కు మాత్ర‌మే ఉంద‌న్న‌మాట‌. 
 
 
ఆ త‌రువాత ప్ర‌ముఖ నిర్మాత క‌ర‌ణ్ జోహార్ విజ‌య్ దేవ‌ర‌కొండ గురించి మాట్లాడుతూ సెక్సీ సౌత్ ఇండియ‌న్ స్టార్ అని, అత‌నికి సినీ ఇండ‌స్ట్రీలో మంచి భ‌విష్య‌త్తు ఉంద‌ని మెచ్చుకున్నారు. ఇటీవ‌ల జాన్వి క‌పూర్ ద‌క్షిణాదిలోనూ సినిమాలు చేయ‌నుంద‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. టాలీవుడ్‌లోకి జాన్వి ఎంట్రీ గురించి ఇక‌పై విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను మీడియా ప్ర‌శ్నించ‌డం ఖాయ‌మ‌నే కామెంట్స్ సోష‌ల్ మీడి