అరవింద సమేత రివ్యూ ….బొమ్మ పడింది …బాక్స్ బద్దలే..!

aravinda sametha , TRendingAndhra

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా , టాలీవుడ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్స్ లో తెరకెక్కిన తాజా చిత్రం అరవిందసమేత వీరరాఘవ . దసరా కానుకగా ఈనెల 11 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది . సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడే కొద్దీ అభిమానుల్లో ఉత్కంఠత కూడా పెరిగిపోతుంది.

NTR, Aravinda Sametha,Trendingandhra

అయితే సినిమా విడుదలకి మరో రోజు ముందే ఒక గుడ్ న్యూస్ వచ్చింది . దుబాయ్ లో ఉంటూ ప్రతి తెలుగు సినిమాని చూసి , సినిమా గురించి రివ్యూ ఇచ్చే సినీ క్రిటిక్ ఉమైర్ సందు గురించి అందరికి బాగా తెలిసే ఉంటుంది . ఈయన ఇప్పటికే చాలా తెలుగు సినిమాలకి ఫస్ట్ రివ్యూలు ఇచ్చేసాడు . ఇప్పుడు అరవిందసమేత కి కూడా తన ఫస్ట్ రివ్యూ ని ఇచ్చాడు . మంగళ వారం యూఏఈ సెన్సార్ సభ్యులతోపాటు సినిమా చుసిన అయన , రివ్యూని ఇచ్చాడు , ఈ రివ్యూ లో మొత్తం ఎన్టీఆర్ గురించే చెప్పాడు . ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ , ప్రధాన బలం అన్ని కూడా ఎన్టీఆర్ అని చెప్పాడు .

aravinda sametha ,Trendingandhra

ఈ సినిమాలో ఎన్టీఆర్ స్టైలిష్ లుక్ , మాస్ స్టోరీ , చప్పట్లు కొట్టేలా డైలాగ్స్ , అత్యంత శక్తివంతమైన క్యారెక్టర్స్ ఈ సినిమాకి మరో ప్రధాన బలం అని చెప్పాడు . ఎన్టీఆర్ అభిమానులకి ఇది మరో ఎమోషనల్ బ్లాక్ బ్లాస్టర్ అని చెప్పాడు . ఈ దసరా కి ఫస్ట్ గిఫ్ట్ అంటూ చెప్పుకొచ్చాడు సందు .కథ గురించి ఎక్కడకూడ ఒక్క ముక్క కూడా చెప్పలేదు . మొత్తానికి ఈ సినిమాకి 4 స్టార్స్ కూడా ఇచ్చాడు . చూడాలి మరి అరవిందసమేత ఏమౌతుందో.