అరవింద సమేత రివ్యూ ….!

aravinda sametha review,aravinda sametha,trendingandhra

చిత్రం : అరవిందసమేత .
నిర్మాణ సంస్థ‌: హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్‌
న‌టీన‌టులు: ఎన్టీఆర్‌, పూజా హెగ్డే, జ‌గ‌ప‌తిబాబు, ఈషా రెబ్బా, నాగ‌బాబు, సునీల్‌, రావు ర‌మేశ్‌, సుప్రియా పాథ‌క్‌, న‌వీన్ చంద్ర‌, సితార‌, బ్ర‌హ్మాజీ, ఈశ్వ‌రీరావు, ర‌విప్ర‌కాశ్ త‌దిత‌రులు
సంగీతం: ఎస్‌.ఎస్‌.త‌మ‌న్‌
పోరాటాలు: రామ్ ల‌క్ష్మ‌ణ్‌
క‌ళ‌: ఎ.ఎస్‌.ప్ర‌కాశ్‌
నిర్మాత‌లు: ఎస్‌.రాధాకృష్ణ (చిన‌బాబు)
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: త్రివిక్ర‌మ్

మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్‌, మాట‌ల‌ను అంతే స్ప‌ష్టంగా ప‌ల‌క‌గ‌ల హీరో ఎన్టీఆర్‌. వారిద్ద‌రు క‌లిస్తే ఎంత గొప్ప సినిమా వ‌స్తుందో కదా అని అభిమానుల ఆశ‌. సినిమా ప్రియుల ఆకాంక్ష‌. దాదాపు 12 ఏళ్ల త‌ర్జ‌న భ‌ర్జ‌న‌ల అనంత‌రం వారిద్ద‌రు ఎంపిక చేసుకున్న‌ది రాయ‌ల‌సీమ నేప‌థ్యాన్ని. మాట‌ల‌కు సొబ‌గుల‌ద్దింది రాయ‌లోరి సీమ యాస‌తో. ఈ యాస‌, వారి కాంబినేషన్ మీదున్న క్రేజ్‌, రాయ‌ల‌సీమ ఫ్యాక్ష‌న్ సినిమా ప్రియుల‌ను ఎంత‌గా అల‌రిస్తున్నాయో చూసేద్దాం.

క‌థ‌:

వీర‌రాఘ‌వ‌రెడ్డి అలియాస్ వీర అలియాస్ రాఘ‌వ (ఎన్టీఆర్‌) కొమ్మ‌ద్దికి చెందిన నార‌ప‌రెడ్డి (నాగ‌బాబు) కుమారుడు. ప‌క్క ఊరు న‌ల్ల‌గుడిలో బ‌సిరెడ్డి (జ‌గ‌ప‌తిబాబు) ఉంటాడు. అత‌ని కుమారుడు బాల‌రెడ్డి (న‌వీన్ చంద్ర‌). ఒకానొక స‌మ‌యంలో బ‌సిరెడ్డి పేక ముక్క‌లు ఆడుతూ ఐదు రూపాయ‌లు బాకీ ప‌డ‌తాడు. అది అడిగిన వ్య‌క్తి త‌ల న‌రుకుతాడు. దాంతో రెండు ఊర్ల మ‌ధ్య ఫ్యాక్ష‌న్ మొద‌ల‌వుతుంది. అమెరికాలో చ‌దువుకున్న రాఘ‌వ కొమ్మ‌ద్దికి వ‌చ్చీరాగానే అదే అదునుగా భావించిన బ‌సిరెడ్డి వారి మీద అటాక్ చేయిస్తాడు. ఆ అటాక్‌లో నార‌ప‌రెడ్డి ప్రాణాలు కోల్పోతాడు. అయితే, నార‌ప‌రెడ్డి త‌ల్లి చెప్పిన మాట‌లు విని రాఘ‌వ‌లో మార్పు వ‌స్తుంది. సిటీకెళ్తాడు. అక్క‌డ అత‌నికి నీలాంబ‌రి (సునీల్‌) ప‌రిచ‌య‌మ‌వుతాడు. అత‌ని గ్యారేజ్‌లో ఉన్న‌ప్పుడే అత‌నికి అర‌వింద (పూజా హెగ్డే) ప‌రిచ‌య‌మ‌వుతుంది. ఆమె ఆంత్రోపాల‌జీ స్టూడెంట్‌. ఫ్యాక్ష‌న్ గురించి స్పెషల్‌గా చ‌దువుతూ ఉంటుంది. ఆ అమ్మాయి చెప్పే మాట‌ల‌కు రాఘ‌వ క‌నెక్ట్ అవుతాడు. ఓ సంద‌ర్భంలో బాల‌రెడ్డిని పిలిచి మాట్లాడుతాడు. అందుకు రాజ‌కీయ ప్ర‌ముఖులు శుభ‌లేఖ సుధాక‌ర్‌, రావు ర‌మేశ్ కూడా మ‌ద్ద‌తు ప‌లుకుతారు. ఆ మీటింగ్ త‌ర్వాత ఏమైంది? బాల‌రెడ్డిని ఎవ‌రు చంపారు? త‌న ఊరు ప‌చ్చ‌గా ఉండాల‌ని రాఘ‌వ క‌న్న క‌ల నెర‌వేరిందా? లేదా? అనేది ఆస‌క్తిక‌రం.

ప్ల‌స్ పాయింట్స్…
ఎన్టీఆర్ న‌ట‌న‌,
త్రివిక్ర‌మ్ డైలాగులు,
రాయ‌ల‌సీమ యాస‌,

మైన‌స్ పాయింట్లు….
ల్యాగ్ బాగా ఎక్కువుగా ఉంది .
పాట‌లు ,
ఈషా పాత్రకు ప్రాధాన్యం లేదు,
ఎంట‌ర్‌టైన్‌మెంట్ త‌క్కువ‌గా ఉండటం .

విశ్లేష‌ణ:

ఫ్యాక్ష‌న్ అంటే కేవ‌లం చంప‌డం.. చంపుకోవ‌డం కాదు.. దాన్ని మించిన ఎమోష‌న్స్ కూడా ఉంటాయ‌ని చెప్పే ప్ర‌య‌త్నంలో భాగంగా ఎన్టీఆర్ , త్రివిక్ర‌మ్ చేసిన చిత్ర‌మిది. మ‌నుషుల మ‌ధ్య ప‌గ‌, ప్ర‌తీకారాల కంటే ప్రేమ ముఖ్యం. ఎప్పుడో ముప్పై ఏళ్ల క్రితం మొద‌లైన గొడ‌వ‌లు స‌మ‌సిపోవ‌డానికి ఓ వ్య‌క్తి చేసే పోరాట‌మే అర‌వింద స‌మేత వీర‌రాఘ‌వ చిత్రం. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ అద్భుత‌మైన న‌ట‌న‌ను క‌న‌ప‌రిచాడు. ముఖ్యంగా ఎమోష‌నల్ సీన్స్‌లో చ‌క్క‌గా న‌టించాడు. తండ్రి చ‌నిపోయిన సీన్స్‌తో పాటు.. విల‌న్స్ భ‌ర‌తం ప‌ట్టే సీన్స్ అయిన యాక్ష‌న్ పార్ట్‌లో ఇర‌గ‌దీశాడు. ఫ‌స్ట్ ఫైట్‌లో ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్‌లో చేసిన ఫైట్ మెప్పిస్తుంది. ఎన్టీఆర్ అంటే అరుచుకునే డైలాగ్స్ కాకుండా.. ఆలోచింప చేసేలా డైలాగ్స్ రాశాడు త్రివిక్ర‌మ్‌. ఎన్టీఆర్ అంటే డాన్స్ కాబ‌ట్టి రెడ్డి ఇక్క‌డ సూడు … పాటలో డాన్స్ అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటుంది. హీరోయిన్ పూజా హెగ్డే అర‌వింద అనే పాత్ర‌లో న‌టించింది. హీరోని గొడ‌వ‌లు వైపు కాకుండా శాంతి వైపు వెళ్లేలా ఆలోచింప‌చేసే పాత్ర అది. అయితే ఆమె న‌ట‌న ప‌రంగా ఇంకా బెట‌ర్‌గా చేసుంటే బావుండేద‌నిపించింది.

మెయిన్ విల‌న్ బ‌సిరెడ్డిగా న‌టించిన జ‌గ‌ప‌తిబాబు లుక్‌, న‌ట‌న ఆక‌ట్టుకుంది. ప‌గ కోసం క‌న్న కొడుకునే చంపుకునే తండ్రి పాత్ర‌లో జ‌గ‌ప‌తిబాబు మ‌రోసారి మెప్పించాడు. లెజెండ్ త‌ర్వాత ఆ రేంజ్ విల‌నిజాన్ని జ‌గ‌ప‌తిబాబు నుండి త్రివిక్ర‌మ్ రాబ‌ట్టుకున్నాడు. ఇక న‌వీన్ చంద్ర పాత్ర కూడా ఆట్ట‌కునేలా ఉంది. ఇక క‌మెడియ‌న్‌గా న‌టించిన సునీల్ పాత్ర ప‌రిమిత‌మే అయినా.. ఉన్నంతో మెప్పించింది. ఈషా రెబ్బా పాత్ర కూడా పెద్ద‌గా చెప్పుకునేంత లేదు. పిసినారి సీనియ‌ర్ లాయ‌ర్‌గా సీనియ‌ర్ న‌రేవ్‌, అత‌ని అసిస్టెంట్‌గా శ్రీనివాస రెడ్డి ఉన్నంత‌లో న‌వ్వించారు. సితార‌, దేవ‌యాని, ఈశ్వ‌రీ రావు, రావు ర‌మేవ్‌, శుభ‌లేఖ సుధాక‌ర్ త‌దిత‌రులు వారి వారి పాత్ర‌ల ప‌రిధుల మేర చ‌క్క‌గా న‌టించారు. ఇక ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ ఫ్యాక్ష‌న్ విత్ ఎమోష‌న‌ల్ కంటెంట్‌ను హెవీ డోస్‌లో క్యారీ చేయించాడు. అందుకు త‌గిన విధంగా డైలాగ్స్‌తో మెప్పించాడు. అయితే ఎంటర్‌టైన్‌మెంట్ యాంగిల్ చాలా త‌క్కువ‌గా ఉంటుంది.

ఫ‌స్టాఫ్ మిన‌హా సెకండాఫ్‌లో ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఉండ‌దు. గొడ‌వ ప‌డేవాడి కంటే దాన్ని జ‌ర‌గ‌కుండా ఆపేవాడే గొప్పోడు.. యుద్ధంలో గెల‌వ‌ని వాడికి శాంతి గురించి మాట్లాడే అర్హ‌త లేదు. రావు రమేష్‌, ఎన్టీఆర్‌… ఎన్టీఆర్‌, జ‌గ‌ప‌తిబాబు.. ఎన్టీఆర్‌, న‌వీన్ చంద్ర మ‌ధ్య స‌న్నివేశాలు ఆక‌ట్టుకుంటాయి. ముఖ్యంగా డైలాగులు మెప్పించేలా ఉన్నాయి. సంగీతం విష‌యానికి వ‌స్తే థ‌మ‌న్ సంగీతం, నేప‌థ్య సంగీతం ఆక‌ట్టుకుంది. పి.ఎస్‌.వినోద్ కెమెరా ప‌నితనం మెప్పిస్తుంది. ఎమోష‌న‌ల్ కంటెంట్ డోస్ పెర‌గ‌డం అనేది యూత్ ప్రేక్ష‌కుల‌ను ఎంత వ‌ర‌కు మెప్పిస్తుంద‌నేది ఆలోచించాల్సిన విష‌యం. మొద‌టి ఇర‌వై నిమిషాలు.. చివ‌రి క్లైమాక్స్ బాగా తెరకెక్కించారు.

చివ‌ర‌గా….కంటతడిపేంటించిన రెడ్డి గారు ..

రేటింగ్‌: 3/5

#AravindaSamethaveeraraghavaReview #AravindaSametha #NTR #Trivikram