మెగాపవర్ స్టార్ .. ఫస్ట్ లుక్ … టీజర్ వచ్చేస్తుంది ….!

MegaPower Star .. First Look ... Teaser Comes ....,mega power star chiranjeevi,chiranjeevi new movie updates,trendingandhra,trendingandhra

బోయపాటి శ్రీను దర్శకత్వంలో చరణ్ కథానాయకుడిగా ఒక యాక్షన్ ఎంటర్టైనర్ నిర్మితమవుతోంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన కీలకమైన సన్నివేశాల చిత్రీకరణను పూర్తిచేశారు. డిసెంబర్ నాటికి అన్ని పనులను పూర్తిచేసి, సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

అయితే ఈ సినిమాకి ఇంతవరకూ టైటిల్ ఖరారు కాకపోవడం .. ఫస్టులుక్ రాకపోవడం అభిమానులను నిరాశకు గురిచేస్తోంది.ఈ నేపథ్యంలో ఫస్టులుక్ ను ఈ నెల 6వ తేదీన మధ్యాహ్నం 1 గంటకు విడుదల చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా టైటిల్ గా ‘వినయ విధేయ రామ’ వినిపించింది. అదే టైటిల్ ను ఖరారు చేస్తారా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఇదే సమయంలో టీజర్ రిలీజ్ డేట్ ను కూడా ఖరారు చేసేశారు. ఈ నెల 9వ తేదీన ఉదయం 10:25 గంటలకు టీజర్ ను వదలనున్నారు. ఇవి మెగా అభిమానులను ఏ రేంజ్ లో ఆకట్టుకుంటాయో చూడాలి.