నోటా మూవీ ప్రీమియర్ షో రివ్యూ..! హిట్టా..?ఫట్టా..?

NOTA , NOTA Premier show , TrendingAndhra
విజయ్ దేవరకొండ మెహ్రీన్ ల కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ నోటా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ ఎత్తున విడుదల కానుంది.ఈ సినిమా పై అంచనాలు భారీగానే ఉన్నాయని చెప్పొచ్చు. తమిళ్ అండ్ తెలుగు భాషల్లో రిలీజ్ కాబోతుంది నోటా.

ఇక రీసెంట్ గా విడుదల అయిన టీజర్,ట్రైలర్,వీడియో ప్రోమోస్ సాంగ్స్ కి భారీ రెస్పాన్స్ రావడంతో సినిమా పై భారీ క్రియేట్ అయ్యింది.ఈ సినిమా నేడు ప్రీమియర్ షో తో రిలీజ్ కానుంది.ముందుగా ఓవర్సీస్ లో ప్రసారం అయిన ఈ సినిమాకు అక్కడ నుండి వస్తున్న టాక్ అద్బుతంగా ఉండనే చెప్పాలి. విజయ్ దేవరకొండ కెరీర్ లోనే ది బెస్ట్ పెర్ఫామెన్స్  ఇచ్చాడు అని సమాచారం .

విజయ్ దేవరకొండ ముఖ్యమంత్రి పాత్ర పోషించడమే ఈ సినిమాకి ప్రధానాకార్షణం. ఆనంద్ శంకర్ సృష్టించిన హీరో ఇజం  సన్నివేశాలు ఫాన్స్‌ ని
ఉర్రూతలూగిస్తాయని సమాచారం.ఇక సినిమాలో హైలెట్స్ విషయానికి వస్తే సినిమా ఫస్టాఫ్ రేసీ గా సాగుతుందని విజయ్ దేవరకొండ డైలాగ్స్, విజయ్ దేవరకొండ మ్యానరిజమ్స్,ఇంటర్వెల్ సీన్ సినిమాకు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్స్ అని అంటున్నారు.

సెకండ్ ఆఫ్ లో ఎమోషన్‌ ఎక్కువై కాస్త స్లో అయినా కానీ ఓవరాల్‌గా ఈ సినిమాలో ప్రేక్షకులు మెచ్చే పాయింట్స్‌ చాలా వుంటాయని టాక్‌
వినిపిస్తుంది.విజయ్ దేవరకొండ కెరీర్ లోనే ది బెస్ట్ గా నిలుస్తుందని అంటున్నారు.అలాగే ఆనంద్ శంకర్ కెరీర్ లోనే ఇప్పటివరకు చేసిన సినిమాల్లో
బెటర్ అవుట్ పుట్ ఇచ్చిన సినిమా ఇదే నని అంటున్నారు.

ఇక మెహ్రీన్ గ్లామర్, డైలాగులు, సినిమాటోగ్రఫీ,సామ్ c.s ఇచ్చిన మ్యూజిక్ అని కూడా సినిమా బిగ్గెస్ట్ ప్లేస్ పాయింట్స్ అయ్యిందిట.ఇక ఓవర్సీస్
నుండి సినిమాకు ఇలా పాజిటివ్ టాక్ రావడం తో ఇక రెగ్యులర్ షోల కి కూడా ఇదే రేంజ్ టాక్ వస్తే సినిమా కచ్చితంగా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ కలెక్షన్స్ వసూలు చేసే ఛాన్స్ ఉంది అని అంటున్నారు.