నోటా మూవీ రివ్యూ

nota , trendingandhra

చిత్రం : నోటా
తారాగ‌ణం: విజ‌య్ దేవ‌ర‌కొండ‌, మెహ‌రీన్‌, స‌త్య‌రాజ్‌, నాజ‌ర్‌, ప్రియ‌ద‌ర్శి, ఎం.ఎస్‌.భాస్క‌ర్
సంగీతం: సి.ఎస్‌.శామ్‌
ఛాయాగ్ర‌హ‌ణం: స‌ంతాన కృష్ణ‌న్‌, ర‌విచంద్ర‌న్‌
నిర్మాత‌: కె.ఇ.జ్ఞాన‌వేల్ రాజా
ద‌ర్శ‌క‌త్వం: ఆనంద్ శంక‌ర్‌

రెండేళ్ల కాలంలో పెళ్ళిచూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం చిత్రాల‌తో వ‌రుస బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్సే కాదు.. యూత్‌లో క్రేజ్‌ను సంపాదించుకున్న యువ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఈ హీరోగా న‌టించిన నాలుగో చిత్రం నోటా. నాలుగో చిత్రంతోనే తెలుగుతో పాటు త‌మిళంలో కూడా అడుగుపెట్టాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. త‌మిళ నిర్మాత కె.ఇ.జ్ఞాన‌వేల్ రాజా ఈ చిత్రాన్ని నిర్మించారు. దేవ‌ర‌కొండ న‌టించిన అర్జున్ రెడ్డి, గీత గోవిందం సినిమాల త‌రహాలోనే ఈ సినిమాకు విడుద‌ల‌కు ముందు కూడా నానా యాగీ జ‌రిగింది. ఓ ద‌శ‌లో సినిమా విడుద‌ల‌పై అనుమానాలు కూడా రేగాయి. అయితే సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని.. విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఆస‌క్తిక‌ర‌మైన మ‌రో విష‌యం.. ఈ సినిమాకు విజ‌య్‌దేవ‌ర‌కొండ నిర్మాణ భాగ‌స్వామిగా కూడా పాలు పంచుకున్నాడు. మ‌రి నోటా విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు ఎలాంటి విజ‌యాన్నిచ్చింది? తెలుగుతో పాటు త‌మిళంలో కూడా విజ‌యాన్ని అందుకున్నాడా? లేదా అనే విష‌యాల‌ను తెలుసుకోవాలంటే సినిమా క‌థేంటో చూద్దాం…

క‌థ‌:
ఓ కేసు కార‌ణంగా వాసుదేవరావ్‌(నాజ‌ర్‌) సిబిఐ కేసుని ఎదుర్కొవ‌డానికి త‌న ముఖ్య‌మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేస్తాడు. త‌న స్థానంలో త‌న కొడుకు వ‌రుణ్‌(విజ‌య్ దేవ‌ర‌కొండ‌)ని సీఎంని చేస్తాడు. రెండు వారాల్లో వాసుదేవ రావ్‌కి బెయిల్ దొరుకుతుంద‌ని అనుకుంటారు. కానీ సిబిఐ కేసు కార‌ణంగా జైలు కెళ్తాడు వాసుదేవ‌రావ్‌. ముందు సీఎం ప‌ద‌విని బాధ్య‌త‌గా ప‌ట్ట‌ని వ‌రుణ్ త‌ర్వాత సీరియ‌స్‌గా తీసుకుని ప్ర‌జ‌ల‌కు సేవ చేయ‌డం ప్రారంభిస్తాడు.వ‌రుణ్‌కి సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ మహేంద్ర (స‌త్య‌రాజ్‌) నుండి స‌హ‌కారం ల‌భిస్తుంది. ప్ర‌జ‌ల ద‌గ్గ‌ర మంచి పేరు సంపాదించుకుంటాడు. అదే స‌మ‌యంలో బెయిల్‌పై విడుద‌లైన వాసుదేవరావ్‌ని చంపే ప్ర‌య‌త్నంలో భాగంగా జ‌రిగిన బాంబు దాడి కార‌ణంగా… అత‌ను కోమాలోకి వెళ్తాడు. అస‌లు త‌న తండ్రిని ఎవ‌రు చంపాల‌నుకున్నార‌నే విష‌యాల‌ను క‌నుక్కోవ‌డానికి వ‌రుణ్ ప్ర‌య‌త్నిస్తాడు. ఆ ప్ర‌య‌త్నంలో.. వ‌రుణ్‌కి బ్లాక్‌మ‌నీకి సంబంధించిన చాలా విష‌యాలు తెలుస్తాయి. అప్పుడు వ‌రుణ్ ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటాడు? ముఖ్య‌మంత్రిగా వ‌రుణ్ ఎలాంటి స‌వాళ్ల‌ను ఎదుర్కొంటాడు? వాటికి ఎలాంటి ప‌రిష్క‌రాలు క‌నుక్కుంటాడు? అనే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే…

విశ్లేష‌ణ‌:
వ‌రుస విజ‌యాలతో ఆక‌ట్టుకున్న విజ‌య్‌దేవ‌ర‌కొండ‌కు ఇప్ప‌టి వ‌ర‌కు వ‌చ్చిన విష‌యాలు ఆషా మాషీగా కాదు. సినిమాకు విజ‌య్ దేవ‌ర‌కొండ పెద్ద ఎసెట్ అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. రాజ‌కీయాల‌తో సంబంధం లేని ఓ యువ‌కుడు అనుకోకుండా రాజ‌కీయాల్లోకి రావ‌డం .. ఎదుర్కొన్న ప‌రిస్థితుల‌ను.. ద‌ర్శ‌కుడు చ‌క్క‌గా చూపిస్తే..సంద‌ర్భానుసారం విజ‌య్ దేవ‌ర‌కొండ బాడీలాంగ్వేజ్ హైలైట్‌గా ఉంటుంది. ముఖ్యంగా స్కూల్ బ‌స్‌ను కాల్చివేసే స‌న్నివేశంలో విజ‌య్ న‌టన ఆక‌ట్టుకుంటుంది. అలాగే.. వ‌ర‌ద‌ల స‌మయంలో యువ‌త‌ను ప్రేరేపించే స‌న్నివేశం.. ఎల‌క్ష‌న్స్‌లో ప్ర‌త్య‌ర్థులు త‌న‌పై వేసిన అభాండాన్ని తెలివిగా త‌ప్పించుకునే స‌న్నివేశం ఇలాంటి స‌న్నివేశాల్లో విజ‌య్ దేవ‌ర‌కొండ న‌ట‌న అంద‌రినీ ఆక‌ట్టుకుంటుంది. ఇక మెహ‌రీన్ పాత్ర చాలా ప‌రిమితం నాలుగైదు స‌న్నివేశాల‌కే ప‌రిమితం. సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్‌గా స‌త్య‌రాజ్‌.. సీనియ‌ర్ ముఖ్య‌మంత్రి పాత్ర‌లో నాజ‌ర్ న‌ట‌న గురించి ప్రత్యేకంగా ప్ర‌స్తావించ‌న‌క్క‌ర్లేదు. ఇక మిగిలిన న‌టీన‌టులంద‌రూ వారి వారి పాత్ర‌ల‌కు త‌గిన విధంగా న్యాయం చేశారు. . ఇక స‌న్నివేశాల ప్ర‌కారం వ‌చ్చే డైలాగ్స్ కూడా ఆక‌ట్టుకున్నాయి. శామ్ సి.ఎస్ ఇచ్చిన ట్యూన్స్ ఆక‌ట్టుకోలేదు. అయితే నేప‌థ్య సంగీతం మాత్రం ఎక్స‌లెంట్‌. సినిమాటోగ్ర‌ఫీ ఓకే. నిర్మాణ విలువ‌లు బావున్నాయి.

ప్ల‌స్ పాయింట్స్‌:
– విజ‌య్ దేవ‌ర‌కొండ న‌ట‌న‌
– నేప‌థ్య సంగీతం
– ఆర్ట్ వ‌ర్క్, లొకేష‌న్స్ బావున్నాయి.
– ఆక‌ట్టుకునే కీల‌క స‌న్నివేశాలు

మైన‌స్ పాయింట్స్‌:
– పాట‌లు
– కొన్ని చోట్ల లాజిక్స్ మిస్ కావ‌డం

రేటింగ్‌: 2.5/5