చెర్రీ, బోయపాటి సినిమాపై క్లారిటీ

Clarity on Cherry, Boyapati Trending Andhra

బోయపాటి శ్రీనివాస్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కాంబినేషన్‌లో చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటి వరకూ ఈ చిత్రం లేట్ అవుతుంది. ఈ ప్రభావం రాజమౌళి తెరకెక్కించబోయే మల్టీస్టారర్‌పై పడుతుందనే పుకార్లు షికారు చేశాయి.

Image result for ramcharan Boyapati sreenu

అయితే ఈ చిత్రం నవంబర్‌ రెండో వారంలో పూర్తి కానుంది. దీంతో ‘RRR’కు కూడా లైన్ క్లియర్ అయింది. ఇక చెర్రీ ప్రశాంతంగా మల్టీస్టారర్‌పై దృష్టి సారిస్తాడనడంలో ఎలాంటి సందేహమూ లేదు. నవంబర్ 10కి షూటింగ్ పూర్తి కానుంది. ఇంకా రెండు పాటలు బ్యాలెన్స్ ఉన్నాయి. నవంబర్ 9 నుంచి డబ్బింగ్ పనులు మొదలవుతాయి.

Image result for ramcharan Boyapati sreenu

జనవరిలోగా నిర్మాణాంతర పనులను పూర్తి చేసుకుని ఈ సినిమా 2019 సంక్రాంతి బరిలో నిలవడం పక్కా. త్వరలోనే ఫస్ట్‌లుక్ కూడా విడుదల కానుంది. ఈ సినిమాలో చెర్రీ సరసన కియారా అద్వాని హీరోయిన్‌గా నటిస్తోంది.