కడప లో ఈసారి క్లీన్ స్వీపేనా ….!

Clean Sweep this time in Kadapa, Trending Andhra

కడప జిల్లాలోని అన్నీ నియోజకవర్గాల్లోను టిడిపి నేతల మధ్య విభేదాలు తీవ్రస్ధాయికి చేరుకున్నాయి అని తెలుస్తుంది . గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరుపున రాజంపేట నియోజకవర్గంలో మాత్రమే టిడిపి అభ్యర్ధి మేడా మల్లికార్జునరెడ్డి గెలిచారు. మిగిలిన నియోజకవర్గాలన్నీ వైసిపి ఖతాలోనే పడ్డాయి. తాజాగా పరిస్థితి చూస్తే వచ్చే ఎన్నికల్లో మొన్న వచ్చిన రాజంపేట అయినా మళ్ళీ దక్కుతుందా అన్నది డౌటుగానే ఉంది. అంటే మొత్తం 10కి 10 సీట్లు వైసిపినే గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.

రాజంపేటలో మేడాకు వ్యతిరేకంగా ఒకవైపు పసుపులేటి బ్రహ్మయ్య మరో వైపు పత్తిపాటి కుసుమకుమారి వాయించేస్తున్నారు. ఇద్దరు ప్రత్యర్ధులతో ఏకకాలంలో పోరాడలేక మేడా నానా అవస్తలు పడుతున్నారట. వచ్చే ఎన్నికల్లో మళ్ళీ మేడాకే టిక్కెట్టిస్తే పార్టీ గెలవదని వాళ్ళిద్దరూ మంత్రులతో మేడా ఎదుటే కుండబద్దలు కొట్టినట్లు చెప్పటం గమనార్హం. ఇక, ప్రొద్దుటూరు సంగతి చెప్పనే అక్కర్లేదు. మాజీ ఎంఎల్ఏ, రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ మధ్య పచ్చగడ్డి వేయకపోయినా మండిపోతోంది. ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో నాలుగైదు గ్రపులుగా చీలిపోయింది టిడిపి. అదే సమయంలో వైసీపీ ఎంఎల్ఏ రాచమల్లు ప్రసాద్ రెడ్డి బలమైన ప్రత్యర్ధి అన్న విషయంచెప్పక్కర్లేదు.

Image result for ycp party

 

ఇక కడప లో మరో కీలకమైన జమ్మలమడుగు సంగతి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదన్నట్లుంది పరిస్ధితి. వైసిపి తరపున గెలిచిన ఆదినారాయణరెడ్డి టిడిపిలోకి ఫిరాయించి మంత్రి అయితే అయ్యాడు కానీ అప్పటి నుండి నియోజకవర్గంలో పూర్తి వ్యతిరేకత వచ్చేసింది. . ఇక, రాయచోటి, కడప, కమలాపురం, కోడూరు, మైదుకూరు, బద్వేలులో పూర్తిగా గ్రూపుల గోల ఎక్కువైపోయిందట. ఒక్క పులివెందులలో మాత్రమే గ్రూపుల గోల పెద్దగా లేదు . కానీ అక్కడ నుండి వైసీపీ అధక్షుడు జగన్ బరిలో నిలుస్తాడు ,పులివెందులలో జగన్ కి పోటీగా దిగి గెలిచే సత్తా ఎవరికీ లేదు అని అందరికి తెలిసిందే.

ఈ వివరాలని చూసిన తరువాత తమ్ముళ్ళల్లో టెన్షన్ బాగా పెరిగిపోయిందట. అంటే చంద్రబాబు నాలుగున్నరేళ్ళ పాలనలో జనాల్లో ఏ స్ధాయిలో వ్యతిరేకత ప్రబలిపోయిందో అర్ధమైపోతోంది. వచ్చే ఎన్నికల్లో పులివెందులలో కూడా టిడిపినే గెలుస్తుందని ఒకవైపు చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నాడు కానీ , కనీసం ఒక్కసీటైనా గెలుస్తుందా అని టీడీపీ నేతలు ఆలోచనలో పడ్డారు