కిడారి కుటుంబానికి రూ.కోటి సాయం ప్రకటించిన సీఎం బాబు …

chandrababu ex gratia to kidari sarveswara rao family

కిడారి సర్వేశ్వరరావును మావోయిస్టులు చంపారన్న వార్త జీర్ణించుకోలేకపోతున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.పాడేరులో కిడారి కుటుంబ సభ్యులను చంద్రబాబు పరామర్శించి ఓదార్చారు. అనంతరం సీఎం మాట్లాడుతూ ఏజెన్సీ అభివృద్ధికి తపనపడిన వ్యక్తి కిడారి సర్వేశ్వరరావు అని కొనియాడారు.

CM Chandrababu ,MLA Kidari Sarveswara rao family , trendingandhra

అలాంటి వ్యక్తి హత్యకు గురికావడం చాలా దారుణం అన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మావోయిస్టులు ఏ విధంగా వచ్చారో దర్యాప్తులో తేలుతుందని వెల్లడించారు. బాక్సైట్‌కు, కిడారి హత్యకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. బాక్సైట్‌ తవ్వకాలకు అనుమతి ఇవ్వబోమని లక్ష మంది ఉన్న సభలో చెప్పానన్నారు.

chandrababu console to kidari family , chandrababu , kidari , trendingandhra

అభివృద్ధి కోసం పాటు పడేవారిని చంపేస్తే.. గిరిజన ప్రాంతాలు ఎలా అభివృద్ధి జరుగుతాయి? అని ప్రశ్నించారు. కిడారి ఆశయసాధనకు కృషి చేస్తామని పేర్కొన్నారు. మావోయిస్టు కాల్పుల్లో చనిపోయిన రెండు కుటుంబాలకు రూ.కోటి ఆర్థికసాయం అందజేస్తామని ప్రకటించారు. అలాగే కిడారి రెండో కుమారుడికి గ్రూప్‌-1 ఉద్యోగం ఇస్తామన్నారు. అంతేకాకుండా పార్టీ పరంగా కిడారి కుటుంబంలో ఉన్న ఒక్కొక్కరికి రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా అందజేస్తామని వెల్లడించారు. విశాఖపట్నంలో ఇంటి స్థలం కూడా కేటాయిస్తామని హామీ ఇచ్చారు. పార్టీ టికెట్ గురించి ఇప్పుడు మాట్లాడటం సరికాదన్నారు. అన్ని విధాలుగా అండగా ఉంటామని చంద్రబాబు భరోసా ఇచ్చారు.