బాబు గారు ఊరు మార్చబోతున్నారా ….!

chandrababu strategy , Trendingandhra

ఉత్తరాంధ్రలో జగన్ ప్రజాసంకల్ప పాదయాత్రకు ఊహించని స్పందన వస్తోంది.ఇటీవల పవన్ కల్యాణ్ పర్యటించినప్పుడు కూడా ఉత్తరాంధ్రలో మంచి రెస్పాన్స్ వచ్చింది. వచ్చే ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో తెలుగుదేశం పార్టీ వెనకబడుతుందని గ్రహించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ
అధినేత చంద్రబాబునాయుడు దీనికి తగిన మందుని కనిపెట్టారు. స్ట్రాటజీలను వేయడంలో చంద్రబాబును మించిన వారు మరొకరు ఉండరు. పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీరామారావు బాటలోనే వెళ్లాలని చంద్రబాబు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఉత్తరాంధ్రలో పార్టీకి ఊపు రావాలన్నా, జగన్, పవన్ ల పార్టీలకూ బ్రేకులు వేయాలన్నది చంద్రబాబు ప్లాన్ గా తెలుస్తోంది.

చంద్రబాబు ఇప్పటి వరకూ ఆరు సార్లు కుప్పం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తూ అప్రతహితంగా గెలుస్తూ వచ్చారు. ఒకసారి చంద్రగిరి నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు.  ఐతే ఈ ఎన్నికల్లో కుప్పం నుండి తన కొడుకు లోకేష్ ని బరిలోకి దింపి , బాబు మరో స్థానాల్లో పోటీకి దిగనున్నాడని తెలుస్తుంది.సిక్కోలు జిల్లా నుంచే ఆయన బరిలోకి దిగాలని దాదాపు చంద్రబాబు డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. శ్రీకాకుళం జిల్లానే ఆయన ఎంచుకున్నట్లుగా పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే శ్రీకాకుళం జిల్లాలో జనరల్ స్థానాలు ఎనిమిది ఉన్నాయి. ఇందులో టెక్కలి నియోజకవర్గానికి మంత్రి అచ్చెన్నాయుడు, ఎచ్చెర్ల నియోజకవర్గానికి మంత్రి కళా వెంకట్రావు, పలాస నియోజకవర్గానికి సీనియర్ నేత గౌతు శ్యాం సుందర్ శివాజీ, ఆముదాలవలస నుంచి విప్ కూన రవికుమార్ లు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మిగిలినవి ఇచ్ఛాపురం, పాతపట్నం, శ్రీకాకుళం, ఆముదాల వలస నియోజకవర్గాలు మాత్రమే జనరల్ స్థానాలుగా ఉన్నాయి.

అయితే పాతపట్నం నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని చంద్రబాబునాయుడు భావిస్తున్నారు.అక్కడ ప్రస్తుతం కలమట వెంకటరమణ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన వైసీపీ నుంచి వచ్చి టీడీపీలో చేరారు. తాను పోటీ చేస్తే ఆయనకు ప్రాధాన్యమున్న పదవి ఇవ్వాలన్నది బాబు ఆలోచన. సిక్కోలు జిల్లా తొలి నుంచి తెలుగుదేశం పార్టీకి కంచుకోవటం కావడం, తాను సిక్కోలు నుంచి పోటీ చేస్తే ఆ ప్రభావం ఉత్తరాంధ్ర మొత్తం పడుతుందన్న భావనలో టీడీపీ అధినేత ఉన్నారు.ఉత్తరాంధ్రలో నిలబడేందుకు బాబు ఫైనల్ చేశారని ఒక ముఖ్యనేత చెప్పారు. ఇలా చంద్రబాబు తన స్థానాన్ని దాదాపు మూడు దశాబ్దాల తర్వాత మార్చుకుంటున్నారన్న టాక్ టీడీపీలో బలంగా విన్పిస్తోంది.