కెసిఆర్ ఒక అపరిచితుడు : రేవంత్ రెడ్డి

 
Revanth Reddy, TrendingAndhra
 
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి కెసిఆర్ గారు  ఏకధాటిగా ప్రతిపక్ష నేతలపై ధ్వజమెత్తుతున్నారు. ఇప్పటికే  ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి  చంద్రబాబు పై  కూడా తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఐతే వనపర్తి సభలో పాల్గొన్నటువంటి కెసిఆర్ గారు రాష్ట్రం లోని  కాంగ్రెస్ నాయకుడైనటువంటి రేవంత్ రెడ్డి పై సంచలన  వ్యాఖ్యలు చేసారు… తాజాగా ఈ వ్యాఖ్యలపై  రేవంత్ రెడ్డి గారు స్పందిస్తూ , రాష్ట్రంలో  కెసిఆర్ గారి కను సైగల్లో కొన్ని టీవీ చానెళ్లు నడుస్తున్నాయని ,అవి కెసిఆర్ గారు ఎలా చెబితే ఆలా  తలాడిస్తాయని , వాటిని  ఆధారం గా చేసుకొని  తనని కావాలనే  టార్గెట్ చేస్తున్నారన్నారు. అంతేగాక తనపై తప్పుడు ప్రచారాల్ని మరియు అసత్య కథనాల్ని చూపిస్తున్నారని , ఇకనైనా  అవి ఆపకపోతే సహించేది లేదని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. అంతేగాక  కెసిఆర్ అపరిచితుడు సినిమా లో లాగా రకరకాలుగా తనకు ఇష్టం వచ్చినట్లు గా  ప్రవర్తిస్తున్నారని పత్రికా సమావేశం లో తెలిపారు
 
revanth reddy , TrendingAndhra
 
ఎంతో  బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి పదవి లో ఉండి ఇలా అసభ్య పదజాలంతో  అవతల వారి పై విమర్శలు చేయడం సరికాదని అన్నారు. ఈ మధ్య  నోటికి ఎలా వస్తే  ఆలా మాట్లాడుతున్నారని ఇంకోసారి ఆలామాట్లాడితే  బాగోదని హెచ్చరించారు. అంతే గాక ఇలాంటి నీచపు మాటలు తనకు రావని , అవన్నీ కెసిఆర్ గారికే చెల్లుతాయని చాలా ఘాటుగా విమర్శించారు.. సోనియా గాంధీ , రాహుల్ గాంధీ  లపై చేసిన వ్యాఖ్యలను కూడా గుర్తు చేస్తూ అసలు తెలంగాణ ని ప్రకటించింది సోనియా, రాహుల్ గాంధీ లేని, అలాంటి  వారిని అసభ్య పదజాలం తో నోటికొచ్చినట్లు మాట్లాడటం సరి కాదన్నారు… అంతే గాక కెసిఆర్ లాంటి వాళ్ళని  తమ రాష్ట్ర  ముఖ్య మంత్రి  అని చెప్పుకోవడానికి  తెలంగాణ ప్రజలు సిగ్గు పడతారని తీవ్ర స్థాయిలో కెసిఆర్ ని విమర్శించారు