కాంగ్రెస్ కు కోమటిరెడ్డి బ్రదర్ అల్టిమేటం… ఆయనకు టికెట్ ఇవ్వకుంటే నాకు వద్దు

congress political news in telangana,congress political news,telangana congress,trendingandhra

అసలే పొత్తుల గొడవ తేలక సతమతమవుతున్న కూటమికి ప్రధాన పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ నేతలు అల్టిమేటం ఇస్తున్నారు. రోజుకొకరు రచ్చ చేస్తున్నారు. మొన్నటికి మొన్న శేరిలింగంపల్లి టికెట్ కోసం భిక్షపతి వర్గం గాంధీ భవన్ లో రచ్చ చేస్తే రాములమ్మ టీడీపీ పై అనుమానాలను లేవనెత్తుతూ అసంతృప్తులకు మరింత ఊతం ఇస్తున్నారు. పొత్తులతో పోటీ చేసేటప్పుడు సీట్ల సర్దుబాటు కు అందరూ సహకరించాలని చెప్పినా ఎవరూ వినే స్థితిలో లేరు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతుంది. ఇప్పటికే టీఆర్ఎస్ నేతలు ప్రచారంలో దూసుకుపోతున్నారు. కానీ.. కాంగ్రెస్ నేతలు మాత్రం సీట్ల పంపకాలే ఇంకా తేల్చుకోలేకపోతున్నారు. తాజాగా.. కాంగ్రెస్ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ అధిష్టానానికి ఓ ట్విస్ట్ ఇచ్చారు. నకిరేకల్ నియోజకవర్గంలో ప్రజాదారణ ఉన్న మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు పార్టీ అధిష్టానం టికెట్ ఇవ్వకుంటే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తాను కూడా పోటీ చేయనని ఆ పార్టీ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భీష్మించుకు కూర్చున్నారు.
చిరుమర్తి లింగయ్య నకిరేకల్ నుంచి, తాను మునుగోడు నుంచి, తన సోదరుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నల్గొండ నుంచి పోటీ చేయాలనుకుంటున్నట్లు తెలిపిన ఆయన అధిష్టానం తమ ముగ్గురికీ ఈ స్థానాల్లో టికెట్ ఇవ్వాలని ఈ సందర్భంగా కోరారు. కానీ పొత్తులలో మిత్ర పక్షపర్తీలు ఈ స్థానాలను కోరుతున్నట్టు తెలుస్తుంది. మరి కోమటి రెడ్డి రాజగోపాల్ కోరినట్టు సీట్లు ఇవ్వకుంటే ఏం చేస్తారో అని కాంగ్రెస్ అధిష్టానానికి ఇప్పటి నుండే భయం పట్టుకుంది.