కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా నవంబర్ మొదటి వారంలో … ఎందుకంటే

congresscandidates list ,trendingandhra

హస్తం పార్టీ నుండి ఆశావహులు జాబితా ప్రకటన కోసం చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు. అదృష్టం ఎవర్ని వరించిందో తెలుసుకోవాలని తహతహలాడుతున్నారు. టికెట్ల కేటాయింపు తాడో పేడో తేలితే ఎవరికి వారు భవిష్యత్ ప్రణాళికలు రూపొందించుకునే ఆలోచనలో ఉన్నారు. అయితే ఇదిగో అదిగో అంటూ ఊరిస్తున్న అభ్యర్థుల ప్రకటన నవంబర్ మొదటి వారానికి చేరింది. నవంబర్ 12 న ఎన్నికల నోటిఫికేషన్ రానున్న నేపధ్యంలో మొదటి వారంలో లిస్టు ప్రకటించాలని వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్ అధినాయకత్వం. ఒక్కొక్కరే పోటీకి ఉన్న నియోజకవర్గాల్లో ఇప్పటికే ప్రచారం చేసుకోమని అనఫీషియల్ గా చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఇబ్బందులు ఉన్న చోట వాటిని సర్దుబాటు చేసే ప్రయత్నం చేస్తుంది.

kuntiya ,trendingandhra

తెలంగాణ రాష్ట్రవ్యవహారాల ఇంచార్జ్ కుంతియా అభ్యర్థుల ప్రకటనను నవంబర్ మొదటి వారంలో ఒకేసారి చేయాలనే అలోచనలో ఉందన్నారు . మొత్తం అభ్యర్థుల జాబితా ఒకేసారి విడుదల చేసి ఎన్నికల సమరానికి దూకనున్నామని చెప్పారు. పొత్తులు కూడా ఓ రెండ్రోజులలో ఖరారు కానున్నాయని ఆయన తెలిపారు. ఈ నెలాఖరున స్క్రీనింగ్ కమిటీ సభ్యులు మరొకసారి సమావేశమై వివిధ సామాజిక వర్గాలకు చెందిన నాయకుల నుంచి అభిప్రాయాలను తీసుకొంటారన్నారాయన. ఈ నెల 27న పార్టీ అధినేత రాహుల్ గాంధీతో ఓ భారీ ర్యాలీని నిర్వహించాలని నిర్ణయించామని చెప్పారు. అయితే ఖమ్మం, మహబూబ్ నగర్, కరీంనగర్ లలో ఎక్కడ నిర్వహించాలనే అంశం పై త్వరలోనే నిర్ణయం తీసుకొంటామని కుంతియా తెలిపారు. రాహుల్ గాంధీ తో మూడు ర్యాలీలను నిర్వహించిన తర్వాత పార్టీ కార్యకర్తలలో ఉత్సాహం రెట్టింపు అయిందని ఆనందం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రవ్యవహారాల ఇంచార్జ్ కుంతియా రాష్ట్రంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో కి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ను ఓడించే వ్యూహంతో కూటమి ముందుకు పోతుందని చెప్పారు.

#CongressWillBeReleaseCandidateslistonNovemberFirstWeek #Kuntiya #TCongress