యాంకర్ ప్రదీప్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలి ….!

criminal case should be registered against anchor pradeep,anchor pradeep,zee telugu anchor pradeep,anchor pradeep pellichoopulu show,trendingandhra

ఓ చానెల్‌లో వస్తున్న ‘పెళ్లి చూపులు’ కార్యక్రమాన్ని రద్దు చేయాలంటూ రాయలసీమ మహిళా సంఘ్‌ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్‌ వద్ద మహిళలు ధర్నా చేశారు. ఆడవాళ్లను అంగడి సరుకును చేసి అవమానిస్తున్న యాంకర్‌ ప్రదీప్‌, ప్రోగ్రాం నిర్వహిస్తున్న సుమ, ప్రసారం చేస్తున్న టీవీ యాజమాన్యం మహిళల మనోభావాలను దెబ్బతీసున్నారని సంఘం జిల్లా అధ్యక్షురాలు శకుంతల అన్నారు. తెలుగు ప్రజల సంప్రదాయాలను, ఆచారాలకు భంగం కలిగించే విధంగా ఈ టీవీ షో నిర్వహిస్తున్నారన్నారు.

criminal case should be registered against anchor pradeep,anchor pradeep,zee telugu anchor pradeep,anchor pradeep pellichoopulu show,trendingandhra

పెళ్లి చూపుల పేరుతో మహిళలను కించపరిచే యాంకర్‌ ప్రదీప్‌పై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని, యాంకర్‌ సుమపై, టీవీ యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అనంతరం జేసీ పి.రవి సుభాష్‌కు వినతిపత్రం సమర్పించారు. వినతిపత్రం సమర్పించిన వారిలో ఉపాధ్యక్షురాలు నాగమణి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నాయకురాలు ఎం.రత్నమణి, బి.రాములమ్మ, బి.సుజాత, శ్రీదేవి, నిర్మలమ్మ, హసీన, ఎన్‌బిసీడబ్ల్యూఏ జాతీయ ప్రధాన కార్యదర్శి నక్కలమిట్ట శ్రీనివాసులు, తదితరులు ఉన్నారు.