ఎన్టీఆర్ బయోపిక్‌ లో దగ్గుపాటి లుక్ రిలీజ్ ..!

daggupati ,ntr biopic, trendingandhra

పిక్‌ఎన్టీఆర్ బయో లుక్ ఒక్కొక్కటీ విడుదల చేస్తుంటే ఒక్కో పాత్ర పరిచయం అవుతోంది. ఇప్పటికే ఎన్టీఆర్ – బసవతారకంతో పాటు చంద్రబాబునాయుడు, హరికృష్ణ వంటి ప్రధాన పాత్రలన్నీ పరిచయమయ్యాయి. ఏ పాత్ర ఎవరు పోషిస్తున్నారో తేలిపోయింది. అయితే, ఎన్టీఆర్ రాజకీయ జీవితంలో ఆయన పెద్దల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావుదీ కీలక పాత్రే. ఇంతవరకు ఆ పాత్రపై సస్పెన్స్ ఉండేది. ఈ బయోపిక్‌లో ఆ పాత్ర ప్రాధాన్యం ఎలా ఉండబోతోంది. ఏ నటుడు ఆ పాత్రను పోషించనున్నాడన్న సస్పెన్స్ ఉండేది. తాజాగా దానికి పుల్ స్టాప్ పడింది. దగ్గుబాటి పాత్రలో భరత్ రెడ్డి నటించబోతున్నారు. ఈ మేరకు తాజాగా విడుదల చేసిన స్టిల్స్‌ లో ఆయన పాత్రను పరిచయం చేశారు.

 

bharath reddy , ntr biopic, daggupati look , trendingandhra

బయోపిక్‌ లో రెండు భాగాలున్నాయి. ఒకటి ఎన్టీఆర్ కథనాయకుడు.. అంటే సినీజీవితానికి సంబంధించింది. రెండోది రాజకీయ జీవితానికి సంబంధించినది.. అది ఎన్టీఆర్ మహానాయకుడిగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మహానాయకుడు పార్టులో దగ్గుబాటి పాత్ర ఉంటుంది. అయితే ఎంచుకున్న నటుడిని బట్టి ఈ పాత్ర నిడివి – ప్రాధాన్యం చాలా తక్కువ ఉంటుందన్న అంచనాలకొచ్చారు.

బాలకృష్ణ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ సినిమాలో చంద్రబాబునాయుడు పాత్రలో దగ్గుబాటి రాణాను ఎంచుకున్నారు. హరికృష్ణ పాత్రకు కూడా కళ్యాణ్ రామ్‌ ను ఎంచుకున్నారు. కానీ, దగ్గుబాటి వెంకటేశ్వరరావు పాత్రను మాత్రం భరత్ రెడ్డితో మమ అనిపిస్తున్నారు. పెద్దగా ఎవరికీ పరిచయం లేని నటుడిని ఈ పాత్రకు అనుకోవడంతో దీనికున్న ప్రాధాన్యం చాలా తక్కువన్న సంకేతాలు వెలువడుతున్నాయి.
నిజానికి ఎన్టీఆర్ రాజకీయ జీవితంలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు పాత్ర చాలా కీలకమైనది. చంద్రబాబు కంటే ముందు ఆయనే ఎన్టీఆర్‌కు బాగా దగ్గర మనిషి. కానీ.. చంద్రబాబు ఆ తరువాత అందరినీ పక్కకు నెట్టి మొత్తం తానే అయ్యారు. దీంతో ఈ బయోపిక్‌లో ఆయన పాత్ర నామమాత్రం అని వినిపిస్తోంది