అరెస్ట్ పై యాంకర్ రవి ఏంచెప్పాడో తెలుసా ..!

Do you know what an anchor rushed on the arrest?

సినీ డిస్ట్రిబ్యూటర్‌పై బెదిరింపులకు పాల్పడ్డాడనే నెపంతో నటుడు, ప్రముఖ యాంకర్ రవిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, ఈ మేరకు ఆయనతో విచారణ కొనసాగుతోందని.. ఈ రోజు(ఆదివారం) ఉదయం నుంచి వార్తలు షికారు చేస్తున్న విషయం తెలిసిందే.

అయితే ఈ విషయమై ఓ వీడియో ద్వారా తాజాగా స్పందించాడు యాంకర్ రవి. ఎస్సార్ నగర్ పోలీసులు నన్ను అదుపులోకి తీసుకున్నారని ఉదయం నుంచి వస్తున్న వార్తల్లో నిజం లేదు. నేను ప్రస్తుతం మచిలీపట్నంలో ఉన్నాను. జెమినీ టీవీ వారు నిర్వహిస్తున్న దివాలీ సెలెబ్రేషన్స్ లో పాల్గొంటున్నాను. ఆ వార్తలన్నీ ఫాల్స్’’ అని వెల్లడించాడు రవి.

#AnchorRavi #Arrest