బాలయ్యతో ఎన్టీఆర్ తొలిసారి ఎప్పుడు , ఎక్కడ మాట్లాడాడో తెలుసా …..!

నటసింహం నందమూరి బాలకృష్ణ, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ను ఒకే వేదికపై చూడాలన్న ఎన్నో రోజుల అభిమానుల కల ‘అరవింద సమేత’ సక్సెస్ మీట్‌తో తీరిపోయింది . అయితే మొదటిసారి ఒక అభిమానిగా తారక్ ఎప్పుడు బాలయ్యతో మాట్లాడాడో పరుచూరి గోపాలకృష్ణ మీడియా తో మాట్లాడుతూ ‘‘నేను, గోపాల్, అడ్డాల చంటి అంతా ‘అల్లరి రాముడు’ షూటింగ్‌ కోసం పాలకొల్లులో ఉన్నాం. అప్పుడు చిన్న రామయ్య(తారక్) ‘మీరు ఎన్టీ రామారావుగారికి ఎలా ఫ్యానో.. నేను మా బాబాయికి అలా ఫ్యాన్ అండి. మీరు ఎలా కాగితాలు చింపి విసిరేస్తారో నేను అలా విసిరేస్తాను… అలా ఈలలు వేస్తాను’ అని చెప్పాడు. మరి నువ్వు ఈ విషయం బాబాయికి ఎప్పుడూ చెప్పలేదా? అంటే ‘లేదండి బాబాయి అంటే భయం ఎక్కువగా మాట్లాడను’ అన్నాడు.
Paruchuri Gopala Krishna,trendingandhra
ఉండు మాట్లాడిస్తాను అని ఫోన్ చేసి ముందు నేను బాలయ్యతో మాట్లాడి.. తారక్‌కి ఇచ్చాను. ఒక అభిమానిగా తారక్ వాళ్ల బాబాయితో మాట్లాడిన సన్నివేశం పాలకొల్లు క్షీరారామంలో మహత్తరమైన పుణ్య ప్రదేశంలో జరిగింది. ఆ తర్వాత ఓ ఫంక్షన్‌లో కూడా బాబాయి, అబ్బాయికి కలిపి ఒకే దండేసిన అకేషన్‌లో కూడా మేము అక్కడే ఉన్నాం’’ అంటూ చెప్పుకొచ్చారు పరుచూరి గోపాలకృష్ణ.
 
#DoyouknowWhenJrNTRFirstTimeTalkwithBalakrishna #paruchuriGopalaKrishna #JrNTR