డాక్టర్లు అతి చేస్తున్నారా..?

jagan , ys jagan health condition , trendingandhra

వైఎస్ జగన్ పై జరిగిన దాడి విషయంలో హైదరాబాద్ సిటి న్యూరో ఆస్పత్రి వైద్యులు అతి చేస్తున్నారా..? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. అసలు గాయ౦ పరిమాణం .5 సెంటి మీటర్లు అని అపోలో వైద్యులు చెప్తే అలా కాకుండా దానికి 9 కుట్లు వేశామని చెప్పడం దానికి హెల్త్ బులిటెన్ విడుదల చేయడం.. దానికి డిశ్చార్జ్ చేయకుండా అలా ఉంచడం ఇప్పటికే ఒక హెల్త్ బులిటెన్ విడుదల చేయడం వంటివి కాస్త కామెడి గానే ఉన్నాయి. అసలు తొమ్మిది కుట్లు పడితే చొక్కా ఎందుకు చిరగాలేదు అనేది కూడా ఎవరికి అంతుబట్టకుండా ఉండి. అలాగే చికిత్స చేయించుకోకుండా వెళ్ళి, అసలు కంప్లైంట్ కూడా ఇవ్వకుండా వెళ్ళిన వ్యక్తికి అసలు ఏ విధంగా చికిత్స చేస్తారు అనేది కూడా అనుమానంగా మారింది. రక్త నమూనాలు అంటూ మీడియా సమావేశాలు పెట్టి హడావుడి చేయడంపై ఇప్పుడు అనేక అనుమానాలు వినపడుతున్నాయి.