రెండో వన్డేలో సెంచరీ తో చెలరేగిన స్మృతి మందాన ..!

ఐసీసీ ఉమెన్స్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా దక్షిణాఫ్రికా మహిళ జట్టుతో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్‌లో భారత ఓపెనర్ స్మృతి మంధాన మరోసారి చెలరేగిపోయింది.తొలి వన్డేలో సఫారీల దుమ్ముదులిపిన ఈ ముంబయి క్రికెటర్ రెండో వన్డేలోనూ సెంచరీ నమోదు చేసింది. తొలి వన్డేలో సఫారీలను చిత్తుగా ఓడించి విజయోత్సహంలో ఉన్న భారత మహిళ జట్టు రెండో వన్డేలో విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకొనేందుకు తన వంతు కృషి చేస్తోంది. మ్యాచ్‌లో సౌతాఫ్రికా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడంతో తొలుత బరిలోకి దిగిన భారత జట్టుకు ఓపెనర్‌లు మంచి ప్రారంభాన్ని అందించారు.

13వ ఓవర్‌ మూడో బంతికి ఓపెనర్ పూనం రౌత్(20) క్లాస్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్ అయింది. ఆ తర్వాత టీం సారథి మిథాలీ రాజ్‌(20)తో కలిసి స్మృతి నిలకడైన ఇన్నింగ్స్ ఆడింది. అయితే మిథాలీ లూస్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరడంతో జట్టు కష్టాల్లో పడింది. ఈ దశలో మంధాన దూకుడు పెంచింది. 117 బంతుల్లో 9 ఫోర్లతో 103 పరుగులు చేసి సెంచరీ నమోదు చేసింది. స్మృతికి హర్మన్‌ప్రీత్ కౌర్(38) మంచి సహకారం అందిస్తుంది.మరో వికెట్ పడకుండా ఆడుతున్నారు. వీరిద్దరు భాగస్వామ్యంతో 40 ఓవర్లు ముగిసేసరికి భారత్ 2 వికెట్ల నష్టానికి 196 పరుగలు చేసింది.