దుబాయ్ భవనాలపై ఇండియా జండా…….!

ప్రధాని పర్యటన గురించి మనందిరికి తెలిసిందే.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రభుత్వం దేశంలోని ప్రముఖ భవనాలను త్రివర్ణకాంతులతో అలంకరించింది. దీంతో శుక్రవారం నుంచే బూర్జ్ ఖలీఫా, దుబాయ్ ఫ్రేమ్, ఎడీఎన్‌వోసీ ప్రధాన కార్యాలయం తదితర భవనాలు త్రివర్ణకాంతులతో శోభిల్లుతున్నాయి.

ప్రధాని రాక సందర్భంగా భారత పతాకాన్ని ప్రతిబింబించేలా ఈ భవంతులను అలంకరించారంటూ యూఏఈలోని భారత రాయబారి నవదీప్ సూరి ట్విటర్లో వెల్లడించారు. మూడు దేశాల పర్యటనలో భాగంగా ఇవాళ పాలస్తీనా వెళ్లిన ప్రధాని మోదీ.. సాయంత్రం అబుదాబి చేరుకోనున్నారు.