జీన్స్ వేసుకుని, లిప్ స్టిక్ పెట్టుకుంటే రేప్ చేసేస్తారట !

సమాజం లో ఆడవాళ్లకు జరిగే ఆఘాయిత్యాల గురించి రాయ్ పూర్ సెంట్రల్ యూనివర్శిటీలో బయాలజీ బోధించే ప్రొఫెసర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు ఇప్పుడు ఆవ్యాఖ్యలు తీవ్రదుమారాన్నిరేపుతున్నాయి.

ఇక్కడ బోధించే స్నేహలతా శంఖ్వార్ అనే టీచర్ విద్యార్థినీ, విద్యార్థులకు కౌన్సెలింగ్ సెషన్ నిర్వహిస్తూ, అమ్మాయిలు జీన్స్ వేసుకుని, లిప్ స్టిక్ పెట్టుకుంటే నిర్భయ వంటి ఘటనలు చోటు చేసుకుంటాయని హెచ్చరించారు.

అందాన్ని చూపించేలా దుస్తులు ధరిస్తే, అత్యాచారం చేయమని ఆహ్వానం పలికినట్టేనని అన్నారు. పొట్టి వస్త్రాలు వేసుకున్నా, ఇష్టం వచ్చినట్టు బయట తిరిగినా నిర్భయకు పట్టే గతే పడుతుందని హెచ్చరించారు. అమ్మాయిలు మరీ సిగ్గు లేకుండా తయారవుతున్నారని అభిప్రాయపడ్డ ఆమె, నిర్భయ అసలు ఓ అమ్మాయి అంత రాత్రి పూట ఎందుకు బయటకు వెళ్లిందని, ఇటువంటి పనులు ఎందుకు చేస్తారని ప్రశ్నించారు.

తన ఉద్దేశంలో తప్పు నిర్భయే చేసిందని, అర్థరాత్రి బయట తిరిగే అమ్మాయిల తప్పుంటుందే తప్ప అబ్బయిల తప్పు కాదని వ్యాఖ్యానించారు. అత్యాచారాలు అమ్మాయిలు చేసే పాపాలకు శిక్షని, తన శరీరాన్ని బయటకు చూపించే అమ్మాయిని ఎలాగైనా సొంతం చేసుకోవాలనే అబ్బాయి భావిస్తాడని అన్నారు. అందమైన ముఖాలు లేని అమ్మాయిలు తమ శరీరాన్ని బయటకు చూపించవచ్చని ముక్తాయింపు ఇచ్చారు స్నేహలత. ఈ రోజుల్లో అమ్మాయిలు ఇష్టం వచిన్నట్టు తిరుగుతున్నారుఅని ఆమె వ్యాఖ్యానించారు. ఆమె వ్యాఖ్యలపై విద్యార్థినుల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.