ఇంతకీ ఆ రోజున సెలవు ఉంటుందా..!  ఓట్ వేస్తమా లేదా ?

election holiday in telangana,trendingandhara

ఇంతకీ ఆ రోజున సెలవు ఉంటుందా… లేదా ? మరో రెండు రోజుల్లో పోలింగ్ మొదలు కానున్న ఈ తరుణం లో ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు కూడా ముమ్మరంగా ప్రచారంలో ముందుకెలుతుంటే నేటి తో ప్రచార గడువు ముగియనున్నడం తో ప్రజా ఓటర్లను ఆకర్షించేందుకు  అన్ని రకాలుగా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. డిసెంబర్ 7 న ఎలక్షన్ ఉండడం తో ఓటర్లు తమ అమూల్యమైన ఓట్ తో వారి అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు తయారు గా ఉన్నప్పటికీ నగర ప్రాంతాలలో  ఉంటున్న    ఉద్యోగులకు   మాత్రమ్  ఈ నెల 7న నిర్వహిస్తున్న ఎలక్షన్స్ కి మాత్రం ఇంకా సెలవులు ప్రకటించక పోవడం గమనార్హం.

అర్హులందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం పోలింగ్‌ రోజున సెలవు ప్రకటించింది. కాగా, మహా నగరంలో అత్యధిక సంఖ్యలో ఉన్న ప్రైవేట్‌, ఐటీ కంపెనీల్లో కొన్ని ఇప్పటివరకూ సెలవుపై సిబ్బందికి స్పష్టత ఇవ్వలేదు. మరికొన్ని కంపెనీలు మాత్రం సెలవు ఇచ్చినా, రెండో శనివారం డ్యూటీకి రావాలంటున్నాయని పలువురు ఐటీ ఉద్యోగులు తెలిపారు. పోలింగ్‌ రోజు సెలవు దినమని స్పష్టంగా ప్రకటిస్తే కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి ఓటు హక్కు వినియోగించుకుంటామని స్వగ్రామాల్లో ఓటు ఉన్నవారు పేర్కొంటున్నారు.

ప్రభుత్వ ఉద్యోగులకి మినహా మిగిలిన వారికి ప్రత్యేక ఓట్ వేసే అవకాశం లేనందున. ఐదు ఏళ్లకు ఒకసారి ఓటరు తన హక్కుని ఇలా ఉపయోగించుకునే అవకాశం వస్తుంది. ఇలాంటి సందర్భాలలో కంపెనీలు కూడా స్వలాభం పక్కన పెట్టి ఉద్యోగులకు సెలవులు ప్రకటిస్తే ఆ రకంగా ఐన వారు వారి హక్కులను ఉపయోగించుకుంటారు అని అందరిలోనూ ఉన్న భావన . ఇప్పటికే నూటికి నూరు శాతం యేపుడు ఓటింగ్ జరగలేదు నిజం చెప్పాలంటే ఎక్కువ గా చదువుకున్న వారే తమ ఓట్ వేయడం లో వెనక ఉంటారు . ఇతర కారణాలు ఎం ఉన్నప్పటికీ ఈ సారి ఐన పూర్తి స్థాయి లో ఓటింగ్ జరిగి మంచి పాలన అందరికీ అందితే చాలు..