మాజీ మంత్రి అరెస్ట్ …!


మెదక్ జిల్లా నర్సాపూర్‌లో మాజీ మంత్రి సునితా లక్ష్మారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. నర్సాపూర్‌లో సునీతారెడ్డి భర్త లక్ష్మిరెడ్డి వర్ధంతి వేడుకలను నిర్వహించేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. 144 సెక్షన్ అమలులో ఉన్నందున జయంతి వేడుకలను నిర్వహించవద్దని పోలీసులు తెలిపారు. దీంతో సునీతారెడ్డి ఆధ్వర్యంలో అంబేద్కర్‌చౌరస్తాలో కాంగ్రెస్ నేతలు ధర్నా చేపట్టారు. వారిని అడ్డుకున్న పోలీసులు సునితారెడ్డి సహా పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సునితారెడ్డి మాట్లాడుతూ రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక తనపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని, టీఆర్‌ఎస్ నాయకులు పిరికి పందలని వ్యాఖ్యానించారు