మత్తు మందు కలిపి మహిళపై లైంగిక దాడి

తెలంగాణ నాగోలు: కూల్ డ్రింక్లో మత్తు మందు కలిపి మహిళపై లైంగిక దాడికి పాల్పడిన ఓ న్యాయవాదిని ఎల్‌బీనగర్‌ పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కథనం మేరకు వివరాలి లా ఉన్నాయి. ఎల్‌బీనగర్‌కు చెందిన మహిళ భర్త బ్యాంకు ఉద్యోగిగి పని చేస్తూ మృతి చెందాడు. దీంతో అతడి ఉద్యోగాన్ని పొందేందుకు ఆమె ప్రయత్నిస్తోంది. సదరు మహిళ భర్తకు స్నేహితుడైన వైజాగ్‌ ఈస్ట్‌పాయింట్‌ కాలనీకి చెందిన న్యాయవాది సోమశేఖర్‌ తాను సాయం చేస్తానని ఆమెను నమ్మించాడు.

ఇందు లో భాగంగానె సదరు మహిళ ఇంటికి వెళ్లిన సోమశేఖర్‌ ఆమెకు తెలియకుండా కూల్ డ్రింక్లో మత్తుమందు కలిపి లైంగిక దాడికి పాల్పడటమేగాక ఆ సమయం లో వీడియోను తీశాడు. తాను చెప్పినట్లు వినకపోతే వీడియోను బయటపెడతానని బెదిరింపులకు పాల్పడుతుండటంతో బాధితురాలు ఎల్‌బీనగర్‌ పోలీసులను ఆశ్రయించింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నింది తుడిని తాడేపల్లిగూడెంలో అరెస్ట్‌ చేసి సోమవారం రిమాండ్‌కు తరలించారు.