మొదటి ఎలక్ట్రిక్ బైక్…….!

ఈ మధ్య కాలం లో యువత ను బైక్స్ బాగా ఆకర్షిస్తున్న విషయం తెలిసిందే.ఇటీవల ఒక సంస్థ న్యూ మోడల్ బైక్ ని లాంచ్ చేసింది.వివరాలలోకి వెళ్తే,దేశంలో తొలి ఎలక్ట్రిక్ సూపర్ బైక్‌ను ఎంఫ్లక్స్ మోటార్స్ ఆటో ఎక్స్‌పో 2018లో ఆవిష్కరించింది. క్రిస్టెన్డ్ ఎంఫ్లక్స్ వన్ మోటార్ సైకిల్‌గా పేర్కొనే ఈ బైక్ స్టాండర్డ్ ధర రూ. 6 లక్షలని కంపెనీ తెలిపింది. టాప్ మోడల్ ధర రూ. 11 లక్షలని ఎంఫ్లక్స్ మోటార్స్ ప్రకటించింది. ఆరు నెలల తర్వాత ఈ బైక్ బుకింగ్స్ ప్రారంభం అవుతాయని, టెస్ట్ రైడ్ సదుపాయం కూడా అప్పుడే ఉంటుందని కంపెనీ తెలిపింది. 2019 ఏప్రిల్ నుంచి ఈ బైక్‌లను కస్టమర్లకు అందజేస్తామని ప్రకటించింది.

ఎంఫ్లక్స్ వన్‌లో 9.7 కిలోవాట్ అవర్ లిథియం ఐరన్ బ్యాటరీని పొందుపరిచారు. ఈ బైక్ కేవలం 3 సెకన్ల వ్యవధిలోనే 100 కి.మీ. వేగాన్ని అందుకోగలదు. గరిష్టంగా గంటకు 200 కి.మీ. వేగంతో ఇది ప్రయాణించగలదు. బ్రెంబో బ్రేక్స్ విత్ డ్యుయల్ ఛానెల్ ఏబీఎస్, సింగిల్ సైడెడ్ స్వింగ్ ఆర్మ్, ఓహ్లిన్స్ సస్పెన్షన్, లైట్ వెయిట్ పోర్జ్‌డ్ అల్లాయ్ వీల్స్ తదితర అత్యాధునిక ఫీచర్లు ఈ బైక్ సొంతమని బెంగళూరుకు చెందిన ఎంఫ్లక్స్ తెలిపింది.

మోడల్ 2 పేరిట మరో వెర్షన్‌ను కూడా మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు ఎంఫ్లక్స్ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇది రెండు వేరియంట్లలో లభిస్తుంది.